Sonali Phogat Murder Case: సోనాలి ఫోగట్ మర్డర్‌లో రాజకీయ నాయకుల హస్తం ఉండొచ్చు.. సీబీఐని కోరిన బంధువులు..
ఈ హత్య వెనుక కొంతమంది పెద్ద వ్యక్తులు హస్తం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. రాజకీయ కారణాల వల్ల సోనాలి హత్య జరిగి ఉండొచ్చని వారు
బీజేపీ నేత సోనాలి ఫోగట్ మర్డర్ కేసును సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. ఆమె కుటుంబసభ్యుల డిమాండ్‌తో కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తునట్టు గోవా ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాజకీయ కారణాలతో సోనాలి హత్యకు గురయ్యే అవకాశముందని ఆమె బంధువులు ఆరోపిస్తుండటం ఇప్పుడు మరింత సంచలనంగా మారుతోంది. సిబిఐ విచారణ తర్వాతే నిజం బయటకు వస్తుందన్నారు. గోవా పోలీసుల దర్యాప్తుతో తాము సంతృప్తి చెందడం లేదన్నారు. గోవా పోలీసులు ఆస్తి కోణంలో కేసును విచారిస్తున్నారని.. ఈ హత్య వెనుక కొంతమంది పెద్ద వ్యక్తులు హస్తం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. రాజకీయ కారణాల వల్ల సోనాలి హత్య జరిగి ఉండొచ్చని వారు అభిప్రాయ పడుతున్నారు. కారణాలు తేలేందుకైనా విచారణ జరగాలని సోనాలి ఫోగట్ బంధువు ఒకరు అన్నారు.
ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినందుకు ఖాప్ పంచాయతీలకు సోనాలి ఫోగట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఖాప్ పంచాయతీలు తమ పూర్తి సహకారం అందించాయని.. ఖాప్ పంచాయతీల కారణంగా హర్యానా, గోవా ప్రభుత్వాలపై కొన్ని చోట్ల ఒత్తిడి వచ్చిందని రుకేశ్ తెలిపారు.
మరోవైపు సోనాలి ఫోగట్ మర్డర్ కేసును ఈనెల 23 లోగా సీబీఐకి అప్పగించాలని ఖాప్ పంచాయత్ హర్యానా ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. అలా కాని పక్షంలో సామూహిక ఆందోళనలు ప్రారంభిస్తామని హెచ్చరించింన సంగతి తెలిసిందే. దీంతో ఫోగట్ కుమార్తె యశోధర, కుటుంబ సభ్యులు కూడా ఈ మహాపంచాయత్‌లో పాల్గొన్నారు. నా తల్లికి న్యాయం జరగాలి. ఈ విషయంలో నాకు మద్దతు ఇవ్వండని యశోధర చేతులు జోడించి మరీ మహాపంచాయత్‌లో కోరారు.
అంతే కాకుండా తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ నివాసానికి చేరుకున్నారు. సోనాలి కూతురు యశోధర, కేసును వాదిస్తున్న వారికి రక్షణ కల్పించాలని కోరారు. దీంతో యశోధరకు రక్షణ కల్పించేందుకు ఇద్దరు పోలీసులను ప్రభుత్వం నియమించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం