రూ.కోటి విలువైన పాము విషం స్వాధీనం, ఒడిశాలో మహిళతో సహా ఆరుగురి అరెస్ట్

ఒడిశాలో అటవీ అధికారులు కోటి రూపాయల  విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు.నిందితుల నుంచి ఒక లీటర్ పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నామని...

రూ.కోటి విలువైన పాము విషం స్వాధీనం, ఒడిశాలో మహిళతో సహా ఆరుగురి అరెస్ట్
Snake Venom Worth Over Rs.1 Crore Seized In Odisha
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 28, 2021 | 12:19 PM

ఒడిశాలో అటవీ అధికారులు కోటి రూపాయల  విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు.నిందితుల నుంచి ఒక లీటర్ పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇది ఓ పెద్ద స్మగ్లింగ్ రాకెట్  అని వారు చెప్పారు. ఒక్కొక్కటి 5 మిల్లీ లీటర్ల అయిదు వైల్స్ ను వీరి వద్ద కనుగొన్నామని. బాలాసోర్ కు చెందిన ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు దీన్ని 10 లక్షల రూపాయలకు అమ్మజూపారని, కానీ ఇది  అంతర్జాతీయ మార్కెట్ లో కోటి  రూపాయల విలువ చేస్తుందని వారు అన్నారు. ఒక లీటర్ విషాన్ని సేకరించాలంటే 200 కోబ్రాలు అవసరమవుతాయని మిశ్రా అనే అధికారి తెలిపారు.వైల్డ్ లైఫ్  ప్రొటెక్షన్ యాక్ట్ ని అనుసరించి  నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, వీరిని రేపు కోర్టులో హాజరు పరుస్తామని ఆయన అన్నారు. ఒడిశాలో ఈ రాకెట్ తో  ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందొ కనుగొంటున్నామన్నారు.

పాము విషానికి ముఖ్యంగా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. కొన్ని రకాల మందుల్లోనూ దీన్ని వినియోగీస్తారు. ఇప్పటికే పలువురు రీసెర్చర్లు ఇందుకు సంబంధించి ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి ప్రాణం  తీసే పాము విషమే మనిషి ప్రాణ రక్షణ మందుగా   కూడా పని చేస్తుందంటే నమ్మలేం. కానీ ల్యాబ్ లలో రోజూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. పాము విషం ఒక లీటర్ కోటి రూపాయలు విలువ చేస్తుందని అటవీ శాఖాధికారులు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

మరిన్ని చదవండి ఇక్కడ:తల్లిదండ్రులకు విజ్ఞప్తి ..తస్మాత్ జాగ్రత్త ..! మీలాంటి వారి కోసమే ఈ వీడియో..: Message For Parents Video.

టీనేజ్ కూతురితో మజాక్ చేస్తున్న నటి ప్రగతి.. వైరల్ అవుతున్న వీడియో : Actor Pragathi Viral Video.

 పురోహితుల క్రికెట్ లీగ్‌ మీరు ఎప్పుడైనా చూశారా..!సిక్సర్లు,ఫోర్లతో దుమ్ములేచిన గ్రౌండ్ : Pandits Cricket League video.