Sidhu Moosewala Murder Case: సిద్ధూ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్.. డెహ్రడూన్‌లో అదుపులోకి తీసుకొని..
హత్యతో ప్రమేయం ఉన్న ఆరుగురిని ఉత్తరాఖండ్, పంజాబ్ పోలీసు బృందం సంయుక్తంగా అరెస్టు చేసింది.
Sidhu Moosewala Murder Case: ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాల (Sidhu Musewala) దారుణ హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. పంజాబ్ (Punjab) ప్రభుత్వం భద్రతను తొలగించిన 24 గంటల్లోనే దుండగులు సిద్ధూపై కాల్పులు జరిపి హత్యచేశారు. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజుకుంది. కాగా.. సంచలనంగా మారిన సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యతో ప్రమేయం ఉన్న ఆరుగురిని ఉత్తరాఖండ్, పంజాబ్ పోలీసు బృందం సంయుక్తంగా అరెస్టు చేసింది. వీరందరినీ.. డెహ్రాడూన్‌లోని పెలియోన్ పోలీస్ చౌకీ ప్రాంతంలో అదుపులోకి తీసున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ ఎస్‌టీఎఫ్ వెల్లడించింది. ఎస్‌టీఎఫ్ పంజాబ్, ఉత్తరాఖండ్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిందితులను అరెస్టు చేశారని.. వారిని పంజాబ్‌కు తరలిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
పంజాబ్ ప్రభుత్వం మూసేవాలాకు భద్రతను తగ్గించిన 24 గంటల లోపే గ్యాంగ్‌స్టర్లు కాల్చిచంపడం సంచలనంగా మారింది. సిద్ధూ మూసేవాలా పూర్వీకుల స్వగ్రామమైన మాన్సాకు ఎస్‌యూవీలో వెళ్తుండగా సుమారు 10 నుంచి 12 మంది వ్యక్తులు అతన్ని అడ్డుకుని 20 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మూసేవాలా అక్కడికక్కడే మరణించగా.. ఆయన మిత్రులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కెనడాకు చెదిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ ఈ హత్య చేసింది తామేనంటూ ప్రకటించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..