Karnataka: ఈనెల 20న సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం.. కేసీఆర్, జగన్‌లకు అందని ఆహ్వానం..!

కర్నాటకలో శనివారం నాడు సిద్దరామయ్య కేబినెట్ కొలువు తీరబోతోంది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం చేయబోతున్నారు. పలువురు విపక్ష నేతలకు ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానం అందింది. అయితే, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు.

Karnataka: ఈనెల 20న సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం.. కేసీఆర్, జగన్‌లకు అందని ఆహ్వానం..!
Karnataka Politics

Updated on: May 18, 2023 | 9:25 PM

కర్నాటకలో శనివారం నాడు సిద్దరామయ్య కేబినెట్ కొలువు తీరబోతోంది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం చేయబోతున్నారు. పలువురు విపక్ష నేతలకు ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానం అందింది. అయితే, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

కర్నాటక సీఎంగా సిద్దరామయ్య..

కర్నాటక సీఎంగా సిద్దరామయ్య ఈనెల 20వ తేదీన ప్రమాణం చేస్తారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం చేస్తారు. బెంగళూర్‌లో జరిగిన సీఎల్పీ భేటీలో సిద్దరామయ్యను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నేతగా ఎన్నుకున్నారు. ఢిల్లీ నుంచి బెంగళూర్‌ చేరుకున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సిద్దరామయ్య కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించారు కార్యకర్తలు.

డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ ఒక్కరే..

డీకే శివకుమార్‌ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల వరకు కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ ఒక్కరే ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు. సీఎం పదవిని రెండున్నర ఏళ్ల పాటు ఇద్దరు నేతలు పంచుకుంటారన్న విషయంపై మాత్రం ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

అసంతృప్తి లేదన్న డీకే..

సీఎం పదవి దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు డీకే శివకుమార్‌. కర్నాటక భవిష్యత్‌, రాష్ట్ర ప్రజల సంక్షేమమే తొలి ప్రాధాన్యత అని అన్నారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య రాజీ కుదర్చడంలో ఖర్గే కీలకపాత్ర పోషించారు. సీఎం ఎంపిక తరువాత ఇద్దరు కలిసి లంచ్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

కేబినెట్‌లో చోటు దక్కించుకుంది వీరే..

ఈశ్వర్ ఖండ్రే, హంపన గౌడ, హెచ్‌కే పాటిల్, లక్ష్మణ్‌ సవది, లక్ష్మి హెబ్బాల్కర్‌, డా.జి.పరమేశ్వర్‌, సతీష్‌ జరకిహోలీ, సుబ్బారెడ్డికి కేబినెట్‌లో అవకాశం దక్కబోతోంది.

విపక్ష నేతలకు ఆహ్వానం..

సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు విపక్ష నేతలకు ఆహ్వానం అందింది. బీహార్‌ సీఎం నితీష్‌, బెంగాల్‌ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్‌, సీపీఎం నేత ఏచూరి, ఫరూక్‌ అబ్దుల్లా తదితరులకు ఆహ్వానాలు అందాయి. కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ , ఏపీ సీఎం జగన్‌కు మాత్రం ఆహ్వానాలు అందలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..