షోవిక్ చక్రవర్తికి బెయిల్ ఎందుకు లభించలేదంటే ?
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ లభించినప్పటికీ, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఇందుకు కారణం రియా..
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ లభించినప్పటికీ, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఇందుకు కారణం రియా..డ్రగ్ డీలర్ల గుంపులో భాగం కాదని, అందువల్ల ఆమెకు బెయిల్ దొరికిందని కోర్టు తెలిపింది. కానీ మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసే డ్రగ్ డీలర్ల ముఠాలతో షోవిక్ కి సంబంధాలున్నాయని, వారితో అతడు టచ్ లో ఉంటూ వచ్చాడని, అందువల్లే అతనికి బెయిల్ మంజూరు చేయలేదని కోర్టు పేర్కొంది. అతనికి చాలామంది డ్రగ్ డీలర్లు తెలుసు..వారితో లావాదేవీలు జరిపేవాడు ఇందుకు ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) వద్ద ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి అన్నారు. సుశాంత్ కోసం షో విక్ డ్రగ్స్ సేకరించాడని, చెల్లింపులు జరిపాడని ఆరోపించలేమన్నారు.