AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుసకు సోదరుడు.. అతడితోనే పెళ్లి అంటున్న యువతి.. పోలీస్ స్టేషన్‌లో రచ్చ రచ్చ!

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ప్రేమ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. తనకు వరుసకు సోదరుడయ్యే యువకుడిని ప్రేమించిన ఓ యువతి.. అతడినే పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా వెనక్కి తగ్గకపోవడంతో చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. అక్కడ గంటల తరబడి హైడ్రామా కొనసాగింది. బదౌన్ జిల్లా బిసౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వరుసకు సోదరుడు.. అతడితోనే పెళ్లి అంటున్న యువతి.. పోలీస్ స్టేషన్‌లో రచ్చ రచ్చ!
Shocking Love Story
Balaraju Goud
|

Updated on: Nov 17, 2026 | 7:00 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ప్రేమ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. తనకు వరుసకు సోదరుడయ్యే యువకుడిని ప్రేమించిన ఓ యువతి.. అతడినే పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా వెనక్కి తగ్గకపోవడంతో చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. అక్కడ గంటల తరబడి హైడ్రామా కొనసాగింది. బదౌన్ జిల్లా బిసౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఒకే కుటుంబానికి చెందిన బంధువులైన యువతి, యువకుడు తరచూ ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లేవారు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు. కుటుంబ సభ్యులు కూడా వారిని అన్నాచెల్లెళ్ల మాదిరిగా భావించడంతో ఎవరూ వారి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేయలేదు.

అయితే, కాలక్రమేణా వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారినట్లు సమాచారం. ఇద్దరూ ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా భావించడంతో పాటు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పెద్దలు ఎంతగా నచ్చజెప్పినా యువతి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరింది. చివరకు యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.

అక్కడ పోలీసులు, కుటుంబ సభ్యులు యువతికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, తాము ఇప్పటికే ప్రేమలో ఉన్నామని, శారీరక సంబంధం కూడా ఏర్పడిందని, ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తనకు ఆ యువకుడే భర్త కావాలని, అతడితోనే జీవితాంతం ఉంటానని పట్టుబట్టింది. మరోవైపు, యువకుడి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు ఆలోచించుకోవడానికి ఐదు రోజుల సమయం కావాలని వారు కోరినట్లు సమాచారం.

దీంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అయితే, ఐదు రోజుల తర్వాత ఇరు కుటుంబాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి? యువతి తన పట్టుదలపై నిలబడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us