AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌కి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే అర్హతలన్నీ ఉన్నాయి

కాంగ్రెస్ పార్టీలో రేగి చల్లారిన సంక్షోభాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ తమ పత్రిక' సామ్నా' లో మళ్ళీ ప్రస్తావించారు. రాహుల్ తలచుకుంటే ఆ పార్టీ అధ్యక్షునిగా ఆయన ఎప్పుడైనా పదవి చేపట్టవచ్ఛునని,..

రాహుల్‌కి  కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే అర్హతలన్నీ ఉన్నాయి
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 3:38 PM

Share

కాంగ్రెస్ పార్టీలో రేగి చల్లారిన సంక్షోభాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ తమ పత్రిక’ సామ్నా’ లో మళ్ళీ ప్రస్తావించారు. రాహుల్ తలచుకుంటే ఆ పార్టీ అధ్యక్షునిగా ఆయన ఎప్పుడైనా పదవి చేపట్టవచ్ఛునని, ఆయనను ఎవరు ఆపగలరని రౌత్ ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మందిలో ఎవరికైనా  ఈ పదవిని అలంకరించే సత్తా గానీ, అర్హతలు గానీ ఉన్నాయా అని అయన అన్నారు. వీళ్లంతా సమిష్టి నాయకత్వం, పూర్తి లీడర్ షిప్ అంటూ తమ లేఖలో నానా యాగీ చేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడేమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఒకప్పుడు వీ.ఎన్. గాడ్గిల్ ఓల్డ్ లేడీ వితౌట్ ఎక్స్ టింక్షన్ అని అభివర్ణించారని, అంటే  ఆ పార్టీకి అంతమంటూ ఉండదని వ్యాఖ్యానించారని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. రాహుల్ ఇప్పుడు ఆ ఓల్డ్ లేడీతో ‘కొనసాగాలని’, ఆయనను ఎవరూ ఆపజాలరని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ‘అసమ్మతివాదులు’గా ముద్ర పడిన కాంగ్రెస్ నేతలు తమ ఆలోచనను మార్చుకోవాలని సంజయ్ రౌత్ సూచించారు.

Follow Us