AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అలా చూస్తుండగానే.. కుప్పకూలిన ఐదు అంతస్థుల భవనం..!

హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాలో భారీ వర్షాల వల్ల వరదలు సంభవించాయి. ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేదు. కులు, మండి జిల్లాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారత వాతావరణ శాఖ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Video: అలా చూస్తుండగానే.. కుప్పకూలిన ఐదు అంతస్థుల భవనం..!
Building Collapses In Shiml
SN Pasha
|

Updated on: Jun 30, 2025 | 4:04 PM

Share

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో ఐదు అంతస్తుల ఇల్లు కూలిపోయింది. సోమవారం ఉదయం సిమ్లాలోని భట్టకుఫర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రాజ్ నివాస్ అనే భవనం కొన్ని సెకన్లలో కూలిపోతున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తూ భవనంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నిరంతర వర్షాలు, సమీపంలో కొండచరియలు విరిగిపడటం స్థానికులను ముందుగానే అక్కడి నుంచి ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఆ ఇంటి యజమాని అంజనా వర్మ భవనం సకాలంలో ఖాళీ చేసినట్లు వెల్లడించారు. సమీపంలో నాలుగు లేన్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున ఈ నిర్మాణానికి ముప్పు పొంచి ఉందని, కొంతకాలంగా ఖాళీగా ఉందని తెలిపారు. భవనం కూలిపోయిన తర్వాత స్థానికులు పరిపాలన అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం శిథిలాలను తొలగించే పనులు జరుగుతున్నాయి. కులు, మండిలలో వర్షం ఉధృతంగా గత 24 గంటలుగా కురుస్తున్న కారణంగా సిమ్లాతో పాటు, కులు, మండి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి, నీటి మట్టాలను నిర్వహించడానికి అధికారులు బియాస్ నదిపై ఉన్న లార్జీ, పండో ఆనకట్టల గేట్లను తెరిచారు.

మండి జిల్లాలో హనోగి దేవి పర్వతం వద్ద ముఖ్యంగా జోగ్ని మలుపు సమీపంలో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. చండీగఢ్-మనాలీ నాలుగు లేన్ల రహదారిపై ప్రజలు ప్రయాణించకుండా ఉండమని ప్రయాణ హెచ్చరిక జారీ చేశారు. ఈ రహదారిపై కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావం విస్తృతంగా ఉండటంతో భారత వాతావరణ శాఖ (IMD) హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలైన సోలన్, సిర్మౌర్, కాంగ్రా, మండిలకు రాబోయే 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి