ఆమెకు అప్పటికే పది మంది పిల్లలు, మళ్లీ ప్రియుడితో పెళ్లి
భర్త లేదా భార్య చనిపోతే కొందరూ మళ్లీ పెళ్లి చేసుకుంటారు. మరికొందరు చేసుకోవడానికి ఇష్టపడరు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని పదిమంది పిల్లలు ఉన్న ఓ మహిళ మళ్లీ చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గోరఖ్‌పూర్ జిల్లా బహల్ గంజ్ ప్రాంతంలో ఉంటున్న సోనీ శర్మ (42) అనే మహిళ భర్త ఆరు సంవత్సరాల క్రితం చనిపోయారు.

భర్త లేదా భార్య చనిపోతే కొందరూ మళ్లీ పెళ్లి చేసుకుంటారు. మరికొందరు చేసుకోవడానికి ఇష్టపడరు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని పదిమంది పిల్లలు ఉన్న ఓ మహిళ మళ్లీ చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గోరఖ్‌పూర్ జిల్లా బహల్ గంజ్ ప్రాంతంలో ఉంటున్న సోనీ శర్మ (42) అనే మహిళ భర్త ఆరు సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆ తర్వాత ఆమె తన గ్రామంలోని బాలేంద్ర (40) అనే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఏడాది క్రితం తమ గ్రామం నుంచి ఇద్దరు పరారయ్యారు. వేరే ప్రాంతంలో కాపురం పెట్టారు. అయితే ఆ జంటను మళ్లీ తన గ్రామానికి పిలిపించి ఆలయంలో పెళ్లి జరిపించారు గ్రామస్థులు.
సోనీ శర్మ, బాలేంద్రలు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే స్థానిక గురుకుల పీజీ కళాశాల ప్రిన్సిపల్ జైప్రకాశ్ షాహీ..ఇద్దరికీ పెళ్లి చేస్తామని ఒప్పించారు. అనంతరం వారిని తమ స్వగ్రామానికి తీసుకొచ్చి శివాలయంలో పెళ్లి జరిపించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




