Bangladesh Crisis: హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై శశి థరూర్ రియాక్షన్ ఇదే..

సంక్షోభ సమయాల్లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు సాయం చేసినందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సోమవారం తన మద్దతు తెలిపారు. మోడీ ప్రభుత్వం హసీనాకు సహాయం చేయకుంటే భారతదేశానికి భవిష్యత్ లో మేలు జరిగదని థరూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు. స్నేహితురాలు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించరని.. హసీనాకు మనం సాయం చేయకపోతే భవిష్యత్ లో భారత్ స్నేహాన్ని ఎవరూ అంగీకరించరని కనుక కష్టంలో ఉన్న హసీనా కు భారత్‌ అండగా నిలబడిందని ఆయన వివరించారు.

Bangladesh Crisis: హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై శశి థరూర్ రియాక్షన్ ఇదే..
Shashi Tharoor On Sheikh Hasina
Follow us
Surya Kala

|

Updated on: Aug 12, 2024 | 1:26 PM

బంగ్లాదేశ్ సంక్షోభంలో చిక్కుకుంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆశ్రయం కోసం భారత దేశానికి చేరుకున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించి ప్రధాని మోడీ చర్యలు సమర్ధించిన విషయం తెలిసిందే.. తాజాగా ఇదే విషయంపై మరో కాంగ్రెస్ సీనియ నాయకుడు..స్పందించారు. సంక్షోభ సమయాల్లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు సాయం చేసినందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సోమవారం తన మద్దతు తెలిపారు. మోడీ ప్రభుత్వం హసీనాకు సహాయం చేయకుంటే భారతదేశానికి భవిష్యత్ లో మేలు జరిగదని థరూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు. స్నేహితురాలు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించరని.. హసీనాకు మనం సాయం చేయకపోతే భవిష్యత్ లో భారత్ స్నేహాన్ని ఎవరూ అంగీకరించరని కనుక కష్టంలో ఉన్న హసీనా కు భారత్‌ అండగా నిలబడిందని ఆయన వివరించారు.

ఇంటికి వచ్చిన స్నేహితురాలు

షేక్ హసీనా భారతదేశానికి స్నేహితురాలు.. భారతదేశం ఆమెకు స్నేహితురాలు కనుక ఆమెకు మనం సాయం చేయకపోతే.. అది భారత్‌కు అవమానం.. సమస్యల్లో ఉన్న ఫ్రెండ్ కు రక్షణ ఇవ్వాలి. ఇప్పుడు భారత్‌ కూడా చేసింది అదే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. అంతకు మించి నేనేమీ కోరుకోవడం లేదు. భారతీయుడిగా మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆమెను ఇక్కడికి తీసుకురావడం.. ఆమెకు భద్రత కల్పించడం ప్రభుత్వం కచ్చితంగా సరైన పని చేసింది” అని థరూర్ అన్నారు.

షేక్ హసీనా ఎంతకాలం భారత్‌లో ఉంటారనే ప్రశ్నకు థరూర్ సమాధానమిస్తూ.. ఇది భారతదేశం తీసుకోవాల్సిన నిర్ణయం కదాని.. మన ఇంటికి ఎవరైనా స్నేహితులు, లేదా అతిధులు వస్తే.. ఎప్పుడు వెళ్ళిపోతారు అని అడగం.. అదే విధంగా హసీనా మన దేశంలో ఎన్నాళ్ళు ఉంటారనేది మనకు అవసరం లేదని అన్నారు. ఆమె భారతదేశంలో ఎంతకాలం ఉండాలనుకుంటే ఎన్ని ఏళ్ళు మనం వేచి చూడాలని శశిథరూర్‌ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

కొత్త ప్రభుత్వం పై ఆందోళన వద్దు

హసీనా వేరే దేశానికి వెళ్లే ముందు వీసా పరిశీలనలు వంటి ఆచరణాత్మక సమస్యలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. అంతేకాదు బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ అధిపతి అయిన ముహమ్మద్ యూనస్‌పై కూడా శశిథరూర్‌ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దేశ రాజధాని ఢాకా నుండి హసీనా బహిష్కరణకు గురైన కొన్ని రోజుల తర్వాత బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. యూనస్‌ను జమాతే ఇస్లామీ లేదా పాకిస్థానీ ఐఎస్‌ఐకి రిలేషన్ షిప్ ఉన్న వ్యక్తిగా చూడవద్దు అని “వాషింగ్టన్‌కు కొంత దగ్గరివాడు” అని థరూర్ అన్నారు. ఢాకాలో యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు.

పాకిస్థానీ ISI, చైనా పాత్రను తోసిపుచ్చని శశి థరూర్

శత్రు దేశాలు మధ్యంతర ప్రభుత్వానికి మద్దతివ్వడంపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శశిథరూర్‌ అన్నారు. ముహమ్మద్ యూనస్ గురించి సందేహాలను నివృత్తి చేస్తూ, బంగ్లాదేశ్‌లో అశాంతిని పెంచడంలో పాకిస్థానీ ISI, చైనా పాత్రను శశి థరూర్ తోసిపుచ్చలేదు. ఈ ప్రాంతంలో తమ ప్రభావాన్ని విస్తరించేందుకు పాకిస్థాన్, చైనాలు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏర్పడిన సంక్షోభాన్ని ఒక అవకాశంగా భావించి ఉండవచ్చునని శశిథరూర్‌ అన్నారు.

హిందువులపై దాడులు స్పందించిన శశి థరూర్

బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై దాడుల విషయంపై కూడా శశి థరూర్‌ స్పందిస్తూ… అదే దేశంలో హిందువులపై, దేవాలయాలపై కచ్చితంగా దాడులు జరిగాయి. ఇది నిజం కనుక ఎవరూ కాదనలేని విషయం. అయితే ఇక్కడ ఊరటనిచ్చే విషయం ఏమిటంటే కొన్ని దేవాలయాలను, హిందువులను అక్కడ ఉన్న కొంత మంది ముస్లింలు రక్షణగా నిలిచి కాపాడుతున్నట్లు వినిపిస్తున్న వార్తలు అని అన్నారు శశి థరూర్.

ఆ అద్భుత విగ్రహాల ధ్వంసం విచారకరం: థరూర్‌

అఖండ భారత దేశం నుంచి తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ గా ఏర్పడి.. తర్వాత బంగ్లాదేశ్‌ దేశంగా ఏర్పడింది. అప్పుడు ముజిబ్‌నగర్‌లో విమోచన దృశ్యాలతో 1971 షహీద్‌ మెమోరియల్‌ను నిర్మించారు. తాజాగా బంగ్లాదేశ్‌ ఆందోళనకారులు ఈ మొమొరియల్ ను ధ్వంసం చేశారు. ఈ విషయంపై కూడా ఎంపీ శశిథరూర్‌ స్పందిస్తూ.. ఇది చాలా విచారకమైన సంఘటన అని అన్నారు. అంతేకాదు ఇలాంటి సంఘటన ద్వారా ఆ దేశంలోని ఆందోళనకారుల అజెండా ఏమిటో స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు. దేశంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం వెంటనే ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని.. శాంతిభద్రతలను కాపాడాలని శశిధరూర్ కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..