ఐఏఎఫ్‌కు తొలి మహిళా ఫ్లయిట్ కమాండర్‌.. రికార్డులకెక్కిన షలీజా

భారతదేశంలో నారీమణులు త్రివిధ దళాళ్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. తాజాగా భారత ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న షలీజా ధామీ ఇప్పుడు ఫ్లయిట్ కమాండర్‌ హోదాను సాధించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షలీజా కావడం విశేషం. హెలికాప్టర్లను నడపడంలో 15ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ధామీ.. తొలి మహిళా ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌, శాశ్వత ప్రాతిపదికన ఎయిర్‌ఫోర్స్‌ ఫ్లయింగ్‌ విభాగంలో చేరిన తొలి మహిళగా కూడా తన పేరును లిఖించుకున్నారు. కాగా పంజాబ్‌లోని లూధియానాలో  జన్మించారు […]

ఐఏఎఫ్‌కు తొలి మహిళా ఫ్లయిట్ కమాండర్‌.. రికార్డులకెక్కిన షలీజా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 28, 2019 | 2:39 PM

భారతదేశంలో నారీమణులు త్రివిధ దళాళ్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. తాజాగా భారత ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న షలీజా ధామీ ఇప్పుడు ఫ్లయిట్ కమాండర్‌ హోదాను సాధించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షలీజా కావడం విశేషం. హెలికాప్టర్లను నడపడంలో 15ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ధామీ.. తొలి మహిళా ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌, శాశ్వత ప్రాతిపదికన ఎయిర్‌ఫోర్స్‌ ఫ్లయింగ్‌ విభాగంలో చేరిన తొలి మహిళగా కూడా తన పేరును లిఖించుకున్నారు.

కాగా పంజాబ్‌లోని లూధియానాలో  జన్మించారు షలీజా ధామీ. 1994లో మహిళలను మొదటిసారి ఐఏఎఫ్‌లోకి అనుమతించగా.. పట్టుదలతో చదివిన ధామీ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సంపాదించారు. వైమానిక దళంలోని చెతక్‌, చీతా హెలికాప్టర్లలో ఇన్‌స్ట్రక్టర్‌గా షలీజా విధులు నిర్వర్తించారు.

Latest Articles