కాశ్మీర్ పై .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన 14 పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి 2 నోటీసులను జారీ చేసింది. అన్ని పిటిషన్ల పైనా అక్టోబరు మొదటివారంలో 5 గురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని అంటూ… ఆ ధర్మాసనానికి వీటిని కోర్టు నివేదించింది. జమ్మూ కాశ్మీర్లో పత్రికలమీద, మీడియా మీద విధించిన ఆంక్షలపై 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని, కాశ్మీర్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కాశ్మీరీ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ […]

కాశ్మీర్ పై .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 28, 2019 | 4:08 PM

ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన 14 పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి 2 నోటీసులను జారీ చేసింది. అన్ని పిటిషన్ల పైనా అక్టోబరు మొదటివారంలో 5 గురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని అంటూ… ఆ ధర్మాసనానికి వీటిని కోర్టు నివేదించింది. జమ్మూ కాశ్మీర్లో పత్రికలమీద, మీడియా మీద విధించిన ఆంక్షలపై 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని, కాశ్మీర్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కాశ్మీరీ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ ఈ మేరకు వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చునని, ఇందుకు ఎవరూ అతడిని ఆపలేరని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో మీడియా స్వేఛ్చకు సంకెళ్లు వేశారని, 24 రోజులుగా అక్కడి జర్నలిస్టులపై ఆంక్షలు కొనసాగుతున్నాయని అనురాధా భాసిన్ తన పిటిషన్ లో అన్నారు. ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని కోరారు. ఇందుకు స్పందించిన ఛీప్జ్ జస్టిస్ రంజన్ గొగోయ్.. వారం రోజుల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ నోటీసు జారీ చేస్తున్నామన్నారు. ఆర్టికల్ 370 రద్దు అన్నది కీలకమైన అంశమని, దీన్ని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనమే విచారించాలని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ కు ‘ మధ్యవర్తి ‘ ని (ఇంటర్ లొక్యుటర్) ను నియమించాలన్న కేంద్రం అభ్యర్థనను ఆయన తోసిపుచ్చారు.

ఇలా ఉండగా.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ సాయంత్రం అత్యంత ప్రధానంగా కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ తరువాత ఆర్ధిక వ్యవహారాలపై గల కేబినెట్ కమిటీ మీట్ అవుతుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం.. ప్రభుత్వం కాశ్మీర్ కు సంబంధించి సరికొత్త ప్యాకేజీని ప్రకటించే అవకాశాలున్నాయి. కాశ్మీరీ యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు, ట్రేడ్ ఇన్వెస్ట్ మెంట్లు ఈ ప్యాకేజీలో భాగంగా ఉండవచ్చు. ఇందుకు గల అవకాశాల అధ్యయనానికి ప్రభుత్వ అధికారులతో కూడిన ఓ ప్రతినిధిబృందం కాశ్మీర్ బయలుదేరింది.