Uttar Pradesh: ఏడు నెలల చిన్నారిపై కుక్కల దాడి.. చికిత్స పొందుతూ మృతి.. ఎక్కడంటే..

|

Oct 18, 2022 | 11:40 AM

వెంటనే స్పందించిన స్థానికులు చిన్నారిని నోయిడాలోని రియాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చిన్నారి మృతి చెందింది.

Uttar Pradesh: ఏడు నెలల చిన్నారిపై కుక్కల దాడి.. చికిత్స పొందుతూ మృతి.. ఎక్కడంటే..
Uttar Pradesh
Follow us on

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నోయిడా సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 100లో ఉన్న లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో ఏడు నెలల చిన్నారిపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన ఆ చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. ఇన్‌స్పెక్టర్ రాజీవ్ బల్యాన్ తెలిపారు. ఈ నిర్మాణ పనుల కోసం  రాజేష్ కుమార్, అతని భార్య సప్న ఏడు నెలల చిన్నారి అరవింద్‌తో కలిసి పని చేసేందుకు వచ్చారు.

రాజీవ్ బల్యాన్ మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం ఇద్దరూ పని చేస్తూ.. తమ బిడ్డను వదిలి కొంచెం ముందుకెళ్లారు. ఇంతలో సొసైటీకి చెందిన మూడు వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి కడుపులోని పేగు బయటకు వచ్చింది. వెంటనే స్పందించిన స్థానికులు చిన్నారిని నోయిడాలోని రియాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చిన్నారి మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు.

కుక్కల బెడదతో ఇబ్బంది పడుతున్న ప్రజలు: 
సొసైటీ అపార్ట్‌మెంట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ (ఏవోఏ) ఉపాధ్యక్షుడు ధరమ్‌వీర్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కుక్కల బెడదతో సొసైటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని చెప్పారు. వీధి కుక్క విషయంపై నోయిడా అథారిటీకి అనేకసార్లు ఫిర్యాదులు చేశామని… అయితే ఇప్పటి వర్కకూ అధికారులు ఎటువంటి  చర్యలు తీసుకోలేదని AOA వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. కుక్కల దాడితో అమాయకులు మృతి చెందిన తీరు సమాజాన్ని భయాందోళనకు గురిచేస్తోందన్నారు. స్థానికులు, పిల్లలు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోయిడా అధికార యంత్రాంగం విఫలం:
ఈ ఘటనపై నోయిడా అథారిటీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినా నోయిడా అథారిటీ ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ఇక్కడ ఉన్న కుక్కలకు రెండ్రోజుల క్రితం స్టెరిలైజ్ చేసి.. మళ్ళీ  ఇక్కడికే తీసుకొచ్చి వదిలేశారని, దీంతో సమస్య మరింత జఠిలమైందన్నారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..