AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫ్రెండ్ బర్త్ డే వేడుక.. స్కూల్లోనే బీర్ తాగిన అమ్మాయిలు

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాకు చెందిన భట్‌చౌరా గ్రామ ప్రభుత్వ స్కూల్లో స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల్లో కొందరు విద్యార్థినులు బీరు తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు డీఈవో టి.ఆర్‌.సాహు తెలిపారు.

Viral: ఫ్రెండ్ బర్త్ డే వేడుక.. స్కూల్లోనే బీర్ తాగిన అమ్మాయిలు
Beer
Ram Naramaneni
| Edited By: TV9 Telugu|

Updated on: Sep 11, 2024 | 3:32 PM

Share

మద్యం సేవించడం అనే పెద్ద దురలవాటు. ఈ అలవాటు వల్ల కుటుంబాలే కూలిపోతున్నాయి. కానీ ఈ రోజుల్లో మద్యం లేనిది ఏ వేడుకా జరగడం లేదు. లిక్కర్ లేకపోతే అది అసలు పార్టీనే కాదు అన్న పరిస్థితికి దిగజారింది వ్యవహారం. మగ, ఆడ అని బేధాలు లేకుండా ఈ రోజుల్లో అందరూ.. మద్యం తాగుతున్నారు. కొంతమైంది మైనర్స్ సైతం లిక్కర్‌కు ఆకర్షితులవుతున్నారు. తాజాగా  ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాకు చెందిన భట్‌చౌరా గవర్నమెంట్ స్కూల్లో ఫ్రెండ్ బర్త్ డే వేడుకల్లో.. కొందరు విద్యార్థినులు బీరు సేవిస్తోన్న వీడియో వైరల్‌గా మారింది. అమ్మాయిలు క్లాస్ రూమ్‌లో కూర్చొని బీరు తాగిన విజువల్స్ వైరల్ అయ్యాయి. జులై 29న జరిగిన ఘటన తాలూకా వీడియోలు, ఫొటోలను ఆ విద్యార్థుల్లో ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. స్కూల్స్‌లో ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా కాకుండా స్కూల్‌ ప్రిన్సిపల్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ కమిటీ.. సంబంధిత స్టూడెంట్స్, టీచర్స్ స్టేట్మెంట్ రికార్డు చేసింది. సరదాగా బీరు బాటిల్స్ చేతుల్లోకి తీసుకొని ఊపామని, తాగలేదని విద్యార్థినులు కమిటీ ఎదుట చెప్పారు. ఈ ఘటనతో ప్రమేయమున్న విద్యార్థుల పేరెంట్స్‌కు సైతం నోటీసులు పంపి, వివరణ కోరుతామని DEO వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..