
School Admission Rules: ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ (DoE) జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా, ప్రాథమిక దశలో మార్పులు చేసింది. 1వ తరగతిలో ప్రవేశానికి 6+ సంవత్సరాల ఏకరీతి వయస్సును అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మార్పు 2026-27 విద్యా సంవత్సరం నుండి దశలవారీగా అమలు చేయనుంది. తల్లిదండ్రులు ఈ మార్పుల గురించి తెలుసుకోవాలి. తద్వారా వారి పిల్లల అడ్మిషన్ ప్రభావితం కాదు.
ప్రవేశ వయస్సులో మార్పులు:
కొత్త పాఠశాలల్లో చేరే విద్యార్థులు వయస్సు ప్రమాణాలు ఇలా ఉన్నాయి.
క్లాస్ 1: 6 నుండి 7 సంవత్సరాలు:
పిల్లల వయస్సు వారు అడ్మిషన్ కోరుతున్న సంవత్సరం మార్చి 31 నాటికి పైన పేర్కొన్న ఫార్ములా ఆధారంగా ఉండాలి.
కొత్త నియమాలు ఎప్పుడు అమలు అవుతాయి?
2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్త వయస్సు ప్రమాణాలు దశలవారీగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 1వ తరగతికి 6+ సంవత్సరాల ఏకరీతి వయస్సు నియమం 2028-29 విద్యా సంవత్సరం నుండి పూర్తిగా అమలు చేయనున్నారు.
ప్రస్తుత విద్యార్థులపై ప్రభావం:
2025-26 విద్యా సెషన్‌లో నర్సరీ, కెజి లేదా 1వ తరగతిలో చేరిన ప్రస్తుత విద్యార్థులకు కొత్త వయస్సు ప్రమాణాలు వర్తించవు. ప్రస్తుతం చేరిన విద్యార్థులందరూ ప్రస్తుత నమూనా ప్రకారం పదోన్నతి పొందుతారు.
వయస్సు సడలింపు నిబంధన:
నర్సరీ నుండి 1వ తరగతి వరకు ప్రవేశానికి కనీస, గరిష్ట వయోపరిమితులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (HoS) ఒక నెల వరకు సడలించవచ్చు.
గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల నుండి బదిలీ:
గుర్తింపు పొందిన పాఠశాల నుండి మునుపటి తరగతిలో ఉత్తీర్ణులై, చెల్లుబాటు అయ్యే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SLC), మార్కుల షీట్ కలిగి ఉన్న విద్యార్థులకు తదుపరి ఉన్నత తరగతిలో ప్రవేశానికి వయో ప్రమాణాల నుండి మినహాయింపు ఉంటుంది.
2026-27 విద్యా సంవత్సరానికి ముఖ్యమైన అంశాలు:
లోయర్ కేజీ, అప్పర్ తరగతులు:
ఈ మార్పుల గురించి తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేయాలని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించింది అక్కడ విద్యాశాఖ. తల్లిదండ్రులు పాఠశాలలు జారీ చేసిన సర్క్యులర్లు, నోటీసులను చదవాలని, వారి పిల్లల అడ్మిషన్‌కు సంబంధించి ఎటువంటి గందరగోళాన్ని నివారించడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కావాలని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి