ప్రశాంత్ భూషణ్ కేసును సీజేఐకే వదిలేసిన ‘సుప్రీం’ బెంచ్

ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్కి సంబంధించిన   కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు..చీఫ్ జస్టిస్ ఎస్ ఎ .బాబ్డేకే వదిలివేసింది. దీన్ని'సముచిత' బెంచ్ ముందు ఉంచాలని కోరింది.

ప్రశాంత్ భూషణ్ కేసును సీజేఐకే వదిలేసిన 'సుప్రీం' బెంచ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 25, 2020 | 12:50 PM

ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్కి సంబంధించిన   కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు..చీఫ్ జస్టిస్ ఎస్ ఎ .బాబ్డేకే వదిలివేసింది. దీన్ని’సముచిత’ బెంచ్ ముందు ఉంచాలని కోరింది. ఈ కేసును మరో బెంచ్ సెప్టెంబర్ 10 న విచారించేందుకు లిస్ట్ లో ఉంచాలని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆదేశించారు. తనకు వ్యవధి తక్కువగా ఉందని, ఈ కోర్టు ధిక్కరణ కేసుపై నాలుగైదు గంటలపాటు సమగ్ర విచారణ జరగవలసి ఉందని ఆయన అన్నారు.   ఇది ఒక న్యాయవాదికి శిక్ష విధిస్తామా కాదా అన్నది కాదని, వ్యవస్థలో నమ్మకానికి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. విశ్వాసం సడలినప్పుడు ఊరట కోసం ప్రజలు కోర్టులను ఆశ్రయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

2009 లో ప్రశాంత్ భూషణ్.. తెహెల్కా మేగజైన్ కి ఇఛ్చిన ఇంటర్వ్యూలో..న్యాయవ్యవస్థ పైన, జడ్జీల పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలోని 16 మంది ప్రధానన్యాయమూర్తుల్లో సగమంది అవినీతిపరులేనని ఆరోపించారు. అయితే ఈ కేసుకు ముగింపు పలకాలని కోరుతున్నామని,  మీరు మీడియాతో మట్కాడుతున్నారా లేక ఏ న్యాయమూర్తిపైనయినా మీకు కసి ఉందా.. లేదా ఏ పరిస్థితుల్లో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వంటి అంశాలను పరిశీలించవలసి ఉందని న్యాయమూర్తి  అరుణ్ మిశ్రా అన్నారు. కాగా-అవినీతి అన్న పదాన్ని వాడారంటే అది కోర్టు ధిక్కరణ కిందికి ఎలా వస్తుందని ప్రశాంత్ భూషణ్ తరఫు లాయర్ రాజీవ్ ధావన్… ‘లా  పాయింట్’ లాగారు.