ఎస్‌బీఐ ఉద్యోగులకు మళ్లీ ‘గోల్డెన్ షేక్ హ్యాండ్’

ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగులకు మళ్లీ గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. రెండవ విడత స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) అమలు చేయనుంది.

ఎస్‌బీఐ ఉద్యోగులకు మళ్లీ 'గోల్డెన్ షేక్ హ్యాండ్'
Follow us

|

Updated on: Sep 07, 2020 | 4:41 PM

ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగులకు మళ్లీ గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. రెండవ విడత స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) అమలు చేయనుంది. ఇందులో భాగంగా దాదాపు 30,190 మంది ఉద్యోగులకు దీనిని వర్తింపచేసేందకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ముసాయిదా సిద్ధం చేసి బోర్డు అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కటాఫ్‌ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్‌ ఆఫీసర్లు, సిబ్బందికి ఇది వర్తిస్తుంది. మొత్తం 11,565 మంది అధికారులు, 18,625 మంది సిబ్బంది వీఆర్‌ఎస్‌కు అర్హులు. వారిలో 30 శాతం మంది ముందుకొస్తారని అంచనా వేస్తున్నారు. తద్వారా దాదాపు 2,170 కోట్ల రూపాయలను ఆదా చేయాలని బ్యాంక్ ఆశిస్తోంది. విఆర్ఎస్ కింద పదవీ విరమణ ఎంచుకున్నసిబ్బందికి మిగిలిన 18 నెలల చివరి వేతనానికి లోబడి, మిగిలిన కాలానికి (సూపరన్యుయేషన్ తేదీ వరకు) 50 శాతం జీతం చెల్లించాలి. వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే ఉద్యోగులకు గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్, మెడికల్ బెనిఫిట్స్ తోపాటు అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందించనుంది. డిసెంబర్‌ 1 నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.