నా ఆఫీసును కూల్చేస్తామన్నారు, కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రోజురోజుకీ ఆమెకీ, శివసేన పార్టీకి మధ్య రేగిన  చిచ్చును పెంచుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో ముంబైని పోల్చడంతో కంగనా పెద్ద ట్రబుల్ లో పడ్డారు.

నా ఆఫీసును కూల్చేస్తామన్నారు, కంగనా రనౌత్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Sep 07, 2020 | 5:43 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రోజురోజుకీ ఆమెకీ, శివసేన పార్టీకి మధ్య రేగిన  చిచ్చును పెంచుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో ముంబైని పోల్చడంతో కంగనా పెద్ద ట్రబుల్ లో పడ్డారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా తన ‘మణికర్ణికా ఫిలిమ్స్’ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారని, అడ్డు వచ్చిన తమ ఇంటి పొరుగింటివారిని భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు. రేపు నా ఈ  కార్యాలయాన్ని కూల్చివేస్తామని బెదిరించారని కంగనా ట్వీట్ చేశారు. అయితే ఇది అక్రమ కట్టడం కాదని, తనకు అన్ని అనుమతులూ ఉన్నాయని పేర్కొన్న ఆమె, ఇది అక్రమ కట్టడమైతే, ఓ నోటీసుతో బాటు స్ట్రక్చర్ ప్లాన్ ని పంపాలని ఆమె కోరారు.

ముఖాలకు మాస్కులు ధరించిన ఏడుగురు వ్యక్తులు తన కార్యాలయంలో ఓ డైనింగ్ టేబుల్ వద్దకు చేరారని, వారిలో ఇద్దరు కూర్చుని ఏదో నోట్ రాస్తున్నట్టు ఉండగా మిగిలినవారు నిలబడ్డారని ఆమె వీడియో ట్విటర్ లో తెలిపారు. ముంబైలో నివసించడమంటే భయంగా ఉందని కంగనా అన్నారు. ప్రస్తుతం ఈమె తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారు. ఈమెకు రక్షణ కల్పిస్తామని, కమెండోలతో బాటు సాయుధ సిబ్బంది ఈమెకు కాపలాగా ఉంటారని హోం  శాఖ ఈ ఉదయం ప్రకటించింది.