ధోనీ మరో సాహసోపేత నిర్ణయం

మహేంద్రసింగ్‌ ధోనీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి చెప్పుకుంటూ వస్తే ఆరు టెస్ట్‌ల సిరీస్‌ అంత పెద్దదవుతుంది.. సెప్టెంబర్‌ 19న జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబాయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడటమే పెద్ద సాహసం.. దానికి కారకుడు ధోనినే!

ధోనీ మరో సాహసోపేత నిర్ణయం
Follow us
Balu

| Edited By: Ravi Kiran

Updated on: Sep 10, 2020 | 5:29 PM

మహేంద్రసింగ్‌ ధోనీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి చెప్పుకుంటూ వస్తే ఆరు టెస్ట్‌ల సిరీస్‌ అంత పెద్దదవుతుంది.. సెప్టెంబర్‌ 19న జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబాయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడటమే పెద్ద సాహసం.. దానికి కారకుడు ధోనినే! ఎందుకంటే చెన్నై టీమ్‌ చాలా రోజులు క్వారంటైన్‌లోనే ఉంది.. ప్రాక్టీసు అంతగా లేదు.. కీలక ఆటగాళ్లు లేరు.. కరోనా వైరస్‌ బారిన ఇద్దరు ఆటగాళ్లు చిక్కుకుని మొన్ననే అందులోంచి బయటపడ్డారు.. ఇంత సంక్లిష్టమైన పరిస్థితులున్నా ధోనీ మాత్రం తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడంటే సాహసం కాక మరేమిటి?

నిజానికి మరో 14 రోజుల్లో అంటూ ఐపీఎల్‌ తన ట్విట్టర్‌లో కోహ్లీ, దినేశ్‌ కార్తీక్‌ ఫోటో పెట్టినప్పుడు మొదటి మ్యాచ్‌ కోల్‌కతా, బెంగళూరు మధ్య జరుగుతుంది కాబోలనుకున్నారంతా! కానీ ధోనీ తీసుకున్న నిర్ణయం కారణంగానే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆడుతుంది.. 19న మొదటి మ్యాచ్‌ ఆడతరా? లేక 23న ఆడతారా అంటూ సీఎస్‌కేకు ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ ఓ ఆఫర్‌ ఇచ్చాడట. 23 అయితే ప్రాక్టీసు కోసం చైన్నైకు సమయం దొరుకుతుంది కదా అన్నది బ్రిజేష్‌ పటేల్‌ ఉద్దేశం! ధోనీ మాత్రం 19న ఆడేందుకే మొగ్గు చూపాడు. ఇలా చేయడం వల్ల మొదటి ఆరు రోజుల్లోనే మూడు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది.. ఏ మాత్రం రెస్ట్ ఉండదు.. అయినా సరే … 19కే మ్యాచ్‌ ఆడాలన్న నిర్ణయం తీసుకున్నాడు ధోనీ. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడానికే ధోనీ ఇలా చేశారేమో! రిస్క్‌తో కూడిన నిర్ణయం తీసుకున్న ధోనీ ఇందులో ఎంత మేరకు సక్సెస్‌ అవుతాడో చూడాలి..