Sankranti Special Trains 2024: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్! ఏయే రూట్లలో ఉన్నాయంటే..
సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు కాచీగూడ నుంచి కాకినాడ, హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తిరగనున్నాయి. అలాగే విజయవాడ మీదుగా కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం (డిసెంబర్ 21) ఒక ప్రకటనలో తెలిపారు..

Sankranti Special Trains 2024
హైదరాబాద్, డిసెంబర్ 22: సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు కాచీగూడ నుంచి కాకినాడ, హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తిరగనున్నాయి. అలాగే విజయవాడ మీదుగా కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం (డిసెంబర్ 21) ఒక ప్రకటనలో తెలిపారు.
కాచిగూడ- కాకినాడ మధ్యలో తిరిగే రైళ్లు ఇవే..
- కాచిగూడ-కాకినాడ టౌన్ (07653) డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది
- కాకినాడ టౌన్ – కాచిగూడ (07654) డిసెంబర్ 29, జనవరి 5,12,19, 26 తేదీల్లో నడుస్తుంది
- హైదరాబాద్-తిరుపతి (07509) డిసెంబర్ 28, జనవరి 4,11,18, 25 తేదీల్లో నడుస్తుంది
- తిరుపతి – హైదరాబాద్ (07510) డిసెంబర్ 29, జనవరి 5,12,19, 26 తేదీల్లో నడుస్తుంది
ఈ ప్రత్యేక రైళ్లన్నిటిలో AC 1, 2, 3 టైర్లతోపాటు స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంంటాయి.
ఇవి కూడా చదవండి
- హైదరాబాద్-నర్సాపూర్ (07631) సర్వీసు జనవరి 6 నుంచి 24 వరకు పొడిగించింది.
- నర్సాపూర్ – హైదరాబాద్ (07632) సర్వీసు జనవరి 7 నంచి 28 వరకు నడుస్తుంది.
- తిరుపతి-సికింద్రాబాద్ (07481) సర్వీసు జనవరి 7 నుంచి 28 వరకు నడుస్తుంది.
- సికింద్రాబాద్ – తిరుపతి (07482) సర్వీసు జనవరి 8 నుంచి 29 వరకు నడుస్తుంది.
- కాకినాడ టౌన్ – లింగంపల్లి (07445) సర్వీసు జనవరి 1 నుంచి 32 వరకు నడుస్తుంది.
- లింగంపల్లి – కాకినాడ టౌన్ (07446) సర్వీసు జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడుస్తుంది.
విజయవాడ మీదుగా వెళ్లే ట్రైన్లు ఇవే..
- జనవరి 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం పూర్ణ–తిరుపతి (07609)
- జనవరి 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం తిరుపతి–పూర్ణ (07610)
- జనవరి 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం హైదరాబాద్–నర్సాపూర్ (07631)
- జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నర్సాపూర్–హైదరాబాద్ (07632)
- డిసెంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం తిరుపతి–సికింద్రాబాద్ (07481)
- జనవరి 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం సికింద్రాబాద్–తిరుపతి (07482)
- జనవరి 1 నుంచి 31 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ పోర్టు–లింగంపల్లి (07445)
- జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) రైళ్లను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.