Monkeypox: భారత్‌లో మంకీపాక్స్ కలకలం.. ఐదేళ్ల చిన్నారి నుంచి నమూనాల సేకరణ..

|

Jun 04, 2022 | 12:22 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నగరంలో ఐదేళ్ల బాలికకు మంకీపాక్స్ (monkeypox) వైరస్ సోకిందన్న అనుమానంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

Monkeypox: భారత్‌లో మంకీపాక్స్ కలకలం.. ఐదేళ్ల చిన్నారి నుంచి నమూనాల సేకరణ..
Monkeypox
Follow us on

Monkeypox in India: కరోనా పీడ పోకముందే.. మరో మహమ్మారి అలజడి రేపుతోంది. మంకీపాక్స్ వైరస్ పలు దేశాలను ఇప్పటికే వణికిస్తోంది. అమెరికా, బ్రిటన్ సహా పలు యూరప్ దేశాలలో నిత్యం పదుల సంఖ్య కేసులు నమోదవుతున్నాయి. దీంతో భారత్‌ సైతం అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో భారత్‌లో ఒక్కసారిగా మంకీపాక్స్ అలజడి రేగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నగరంలో ఐదేళ్ల బాలికకు మంకీపాక్స్ (monkeypox) వైరస్ సోకిందన్న అనుమానంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

బాలికకు మంకీపాక్స్ సోకిందనే అనుమానంతో తాము పరీక్షల కోసం నమూనాలను సేకరించినట్లు ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శనివారం వెల్లడించారు. మంకీపాక్స్ సాధారణంగా ఫ్లూ లాంటి అనారోగ్యం, కణాల వాపుతో ప్రారంభమవుతుందని వైద్యులు తెలిపారు. తర్వాత ముఖం, శరీరంపై దద్దుర్లు వస్తాయని వైద్యులు పేర్కొ్నారు. ప్రస్తుతం బాలికను ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే.. గత నెల నుంచి బాలికకు ఇతర ఆరోగ్య సమస్యలు లేవని, బాలిక లేదా ఆమె సన్నిహితులు ఎవరూ విదేశాలకు వెళ్లలేదని వైద్యులు తెలిపారు. రిపోర్టులు వస్తేనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఘజియాబాద్ బాలికకు మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో స్థానిక ప్రజలు భాయాందోళన చెందుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..