అందరిలాగే మీకూ సేమ్ ఫుడ్.. చిద్దూకి షాకిచ్చిన కోర్టు
ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తినేందుకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను జస్టిస్ సురేష్ కుమార్ తోసిపుచ్చారు. జైల్లో ప్రతివారికీ పెట్టే ఆహారమే మీరూ తినాల్సి ఉంటుందని అన్నారు. ఇంటి ఫుడ్ తినేందుకు తన క్లయింటును అనుమతించాలని చిదంబరం తరఫు లాయర్ కపిల్ సిబల్ కోరగా-ఇందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఆయన వ్యాఖ్యకు ఆశ్చర్యపోయిన […]
ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తినేందుకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను జస్టిస్ సురేష్ కుమార్ తోసిపుచ్చారు. జైల్లో ప్రతివారికీ పెట్టే ఆహారమే మీరూ తినాల్సి ఉంటుందని అన్నారు. ఇంటి ఫుడ్ తినేందుకు తన క్లయింటును అనుమతించాలని చిదంబరం తరఫు లాయర్ కపిల్ సిబల్ కోరగా-ఇందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఆయన వ్యాఖ్యకు ఆశ్చర్యపోయిన సిబల్.. ‘ మిలార్డ్ ! ఆయన (చిదంబరం) వయస్సు 74 ఏళ్ళు ! ‘ అన్నారు. అయితే దీనికి స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఐ ఎన్ ఎల్ డీ నేత ఓంప్రకాష్ చౌతాలా కూడా వయస్సు మళ్ళినవారేనని, పైగా ఆయన రాజకీయ ఖైదీ అని అన్నారు. ఎవరినీ వేర్వేరుగా చూడలేం కదా అన్నారు. తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టులో ‘ ఈ ఫుడ్ ‘ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. తన క్లయింటుకు సంబంధించి ఆయన నేరాలకు పరిమిత కాల జైలుశిక్ష మాత్రమే సరిపోతుందని, ఐపీసీ లోని సెక్షన్ 420 ఆయనకు వర్తించదని కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన తుషార్ మెహతా.. కేసు ఇప్పుడు ప్రీ-చార్జిషీటు దశలోనే ఉందని చెప్పారు.’ పిటిషనర్ ని ఆగస్టు 21 న అరెస్టు చేశారు. 2007 లో ఆయన అవినీతితో సహా పలు నేరాలకు పాల్పడ్డారు ‘ అని మెహతా అన్నారు. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని, 14 రోజులపాటు తనను జ్యూడిషియల్ కస్టడీకి పంపాలన్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ చిదంబరం రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు.