Madhya Pradesh Elections: ఎన్నికల్లో ఘాటు మామూలుగా లేదుగా.. సీఎంపై మిర్చి బాబా పోటీ..
Madhya Pradesh Elections 2023: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సొంత నియోజకవర్గంలో ఆసక్తికర పోరు కనిపిస్తుంది. బుద్నీ పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కంచుకోటపై గురిపెట్టిన సమాజ్‌వాదీ పార్టీ.. మామపై పోటీకి మిర్చి బాబాను రంగంలోకి దింపుతుంది.

Madhya Pradesh Elections 2023: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సొంత నియోజకవర్గంలో ఆసక్తికర పోరు కనిపిస్తుంది. బుద్నీ పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కంచుకోటపై గురిపెట్టిన సమాజ్‌వాదీ పార్టీ.. మామపై పోటీకి మిర్చి బాబాను రంగంలోకి దింపుతుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఫైట్ టగ్ఆఫ్ వార్‌గా నడువనున్నాయి. మిర్చి బాబా అసలు పేరు రాకేశ్ దుబే. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా బిర్ఖడిలో ఓ పూజారి దంపతులకు జన్మించారు. 1997 వరకు ఓ నూనె మిల్లులో పనిచేసిన రాకేశ్ దుబే.. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి నష్టాలపాలయ్యారు. తర్వాత గుజరాత్ అహ్మదబాద్ వెళ్లి ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో చేరారు. కొంతకాలం తర్వాత అక్కడే సన్యాసం స్వీకరించి తన పేరును వైరాగ్యనంద గిరిగా మార్చుకున్నారు.
బాబాగా మారిన తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ భగవద్గీత బోధిస్తూ తన వద్దకు వచ్చే భక్తులకు ప్రసాదంగా కారం పొడిని ఇచ్చి ఫేమస్ అయ్యారు. దీంతో ఆయన మిర్చి బాబాగా పేరుగాంచారు. వైరాగ్యనందకు ఈక్రమంలో ఏర్పడిన కొంతమంది రాజకీయ నేతలతో పరిచయాలతో ఏకంగా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కలిశారు. 2018 ఎన్నికల సమయంలో మిర్చి బాబా కాంగ్రెస్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే, కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. మిర్చి బాబాకు సహాయ మంత్రి హోదా కల్పించింది. కో ఆపరేషన్ సొసైటీకి ఛైర్మన్‌ను చేసింది. ఇక, 2019 ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్ ఓటమితో జలసమాధి పూనుకున్నాడు మిర్చిబాబా. పోలీసులు అడ్డుకోవడంతో ఆ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. కొన్ని రోజులగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు మిర్చిబాబా. దీంతో బుద్నీ స్థానం నుంచి బరిలోకి దించుతూ ఎస్పీ.. అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
కాగా.. మధ్య ప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17 న జరగనున్నాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. ఇక్కడ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..