మోదీకి ‘ఎసరు’పెడుతోన్న సాద్వీ..ఓవైసీ కౌంటర్

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే భోపాల్ ఎంపీ, బీజేపీ నేత ప్రగ్యాసింగ్ ఠాకూర్ మరోసారి తన పంథాలో కాంట్రోవర్శీ వ్యాఖ్యలు చేశారు.  ఒక ఎంపీ స్థాయిలో ఉన్న తాను బాత్రూమ్‌లు కడగటమేంటని బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శల పాలవుతున్నాయి. సాధ్వీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చీపురు పట్టుకొని స్వచ్ఛ భారత్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారని, స్వచ్ఛత పనిపై తనకు […]

మోదీకి 'ఎసరు'పెడుతోన్న సాద్వీ..ఓవైసీ కౌంటర్
Ram Naramaneni

|

Jul 22, 2019 | 6:03 PM

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే భోపాల్ ఎంపీ, బీజేపీ నేత ప్రగ్యాసింగ్ ఠాకూర్ మరోసారి తన పంథాలో కాంట్రోవర్శీ వ్యాఖ్యలు చేశారు.  ఒక ఎంపీ స్థాయిలో ఉన్న తాను బాత్రూమ్‌లు కడగటమేంటని బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శల పాలవుతున్నాయి. సాధ్వీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చీపురు పట్టుకొని స్వచ్ఛ భారత్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారని, స్వచ్ఛత పనిపై తనకు ఎలాంటి బాధ్యత లేదని ప్రగ్యా వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సైతం సాధ్వీని ఆదేశించారు.

కాగా సాద్వీ వ్యాఖ్యలపై  ఏఐఎమ్‌ఐఎమ్ అధినేత, ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ స్పందించారు. నాథూరాం గాడ్సేను పొగడటం..భారత బ్రేవ్ పోలీసు అధికారి హేమంత్ కర్కరే గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం..మరోవైపు దేశంలో కులవ్యవస్థ ఉండాలంటూ ప్రకటనలు చేయడం సాద్వీకే చెల్లిందంటూ వ్యాఖ్యానించారు. ఒకవైపు ప్రధాని మోదీ స్వచ్చ భారత్ అంటూ ప్రయత్నాలు చేస్తుంటే..భాద్యాతాయుతమైన పదవిలో ఉండి బాత్రూమ్స్ కడగటానికి ఎంపీని అవ్వలేదు అంటూ ఆయన విజన్‌కు వ్యతిరేకంగా సాద్వీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu