Rajasthan: ఈసారి రాజస్థాన్ లో విజయం ఈ పార్టీదే.. ఎన్నికల వేళ సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజస్థాన్ లో వరుసగా రెండోసారి ఒకే పార్టీ ఎందుకు అధికారంలోకి రావడంలేదో ఆత్మ పరిశీలను చేసుకోవాలని సచిన్ పైలట్ అన్నారు. ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ స్పీకర్ సచిన్ పైలట్ కి మధ్య ఇప్పటికే సఖ్యత లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజస్థాన్ లో వరుసగా రెండోసారి ఒకే పార్టీ ఎందుకు అధికారంలోకి రావడంలేదో ఆత్మ పరిశీలను చేసుకోవాలని సచిన్ పైలట్ అన్నారు. ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ స్పీకర్ సచిన్ పైలట్ కి మధ్య ఇప్పటికే సఖ్యత లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 30ఏళ్లుగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు ఐదేళ్లకు మాత్రమే పరిమితమయ్యాయని చరిత్రను గుర్తు చేశారు. అయితే ఈ సారి ఆ చరిత్రను కాంగ్రెస్ పార్టీ తిరగరాస్తుందని జోస్యం చెప్పారు.
ఈ దఫా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే అంటూ గంటాపదంగా చెప్పారు. దీనికి గల కారణాలను ప్రస్తావించారు. సంక్షేమం, పెట్టుబడులు, అభివృద్దే, సంపద సృష్టి తమను అధికారంలో నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపే ప్రభుత్వం కావాలి కానీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఎందుకంటూ బీజేపీని విమర్శించారు. రాష్ట్రంలో తమకు ఉన్న విభేదాలనపై స్పందిస్తూ ఈ సారి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తామన్నారు. పదవులపై అధిష్టానం దృష్టాసారిస్తుందని వివరించారు. గతంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే, రాహూల్ గాంధీతో జరిగిన భేటీలో తాను కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
వారిద్దరి సలహా మేరకు గతంలో ఏవైనా ఉద్దేశ్యపూర్వక వ్యాఖ్యలు చేసి ఉంటే క్షమించండి.. మరచిపోయి ముందుకు సాగుదాం అనే మంత్రాన్ని అనుసరించి ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తామని వివరించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో అన్న చర్చ జోరుగా జరుగుతోంది. గతంలో సచిన్ పైలట్ కాంగ్రెస్ వీడి బయటకు వస్తారన్న వార్తలతో ఆ పార్టీ చతికిల పడిపోతుందని అందరూ భావించారు. కానీ ఇటీవల కాలంలో ఈయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు కొంత మైలేజ్ తెచ్చేదిగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సచిన్ పైలెట్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు ఏమాత్రం మేలు చేస్తుందో తెలియాలంటే డిశంబర్ 3న విడుదలయ్యే ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..