ప్రధాని మోదీని, సీఎం యోగిని చంపుతానని బెదిరింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడు తనకు ప్రధానిమోదీ, సీఎం యోగిలను హతమార్చేందుకు తనకు కాంట్రాక్టు ఇచ్చారని ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు దుండగుడు. దీంతో సదరు వ్యక్తిని మాటల్లో పెట్టిన ముంబై పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ యోగి అదిత్యానాథ్ చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడు తనకు ప్రధానిమోదీ, సీఎం యోగిలను హతమార్చేందుకు తనకు కాంట్రాక్టు ఇచ్చారని ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు దుండగుడు. దీంతో సదరు వ్యక్తిని మాటల్లో పెట్టిన ముంబై పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
బుధవారం నవంబర్ 22న ఒక పోలీస్ అధికారి ఈ సమాచారాన్ని అందించారు. 29 ఏళ్ల నిందితుడిని కమ్రాన్ అమీర్ ఖాన్‌గా గుర్తించామని చెప్పారు. ముంబైలోని సియోన్ ఈస్ట్‌లో నివాసముంటున్న అతడు ఈ బెదిరింపు కాల్ చేశాడు. అయితే ఈ కాల్ ఫేక్ అని తేలింది.
అయితే గతంలోనూ ఇలాంటి ఫేక్ కాల్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి ఇలాంటి ఫోన్ కాల్ చేసినందుకు కొంతకాలం క్రితం ఉత్తరప్రదేశ్ పోలీసులు తనను అరెస్టు చేశారని ముంబై పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు మంగళవారం ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ప్రభుత్వ జేజే ఆసుపత్రిని పేల్చివేస్తానని బెదిరించాడు. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడు తనకు ప్రధాని నరేంద్ర మోదీని , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హతమార్చేందుకు కాంట్రాక్ట్ ఇచ్చారని కూడా పేర్కొన్నారు.
చికిత్స కోసం జేజే హాస్పిటల్‌కు వచ్చిన నిందితుడు.. పేషెంట్లు చాలా మంది క్యూలో ఉన్నారు. నిందితుడు డాక్టర్‌ని కలవడంలో జాప్యం జరిగిందని భావించాడు. దీంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ‘నిందితుడు మానసికంగా అస్వస్థతతో బాధపడుతున్నాడని, ఫేక్ కాల్ కేసులో ఇంతకుముందు కూడా అరెస్ట్ చేశామని’ పోలీస్ అధికారి తెలిపారు. ఖాన్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 505 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…