AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. రోప్‌వే కూలి ఆరుగురు దుర్మరణం.. ఎక్కడంటే..

గుజరాత్‌ లోని పావగఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భవన నిర్మాణానికి ఉపయోగిస్తున్న రోప్‌వే తెగిపోవడంతో ప్రమాదం జరిగింది. సామాగ్రిని తరలిస్తుండగా రోప్‌వే తెగిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రోప్‌వే ట్రాలీ పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్‌ ఆపరేటర్లు కూడా ఉన్నారు.

అయ్యో దేవుడా.. రోప్‌వే కూలి ఆరుగురు దుర్మరణం.. ఎక్కడంటే..
Ropeway Snaps At Pavagadh Hill Temple
Shaik Madar Saheb
|

Updated on: Sep 06, 2025 | 7:16 PM

Share

గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని పావగఢ్ కొండపై ఉన్న శక్తిపీఠ్ స్థలంలో శనివారం మధ్యాహ్నం కార్గో రోప్‌వే ట్రాలీ కూలిపోవడంతో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. కొండపైకి నిర్మాణ సామాగ్రిని రవాణా చేసే కార్గో రోప్‌వే ట్రాలీ.. కేబుల్స్ తెగిపోయి కూలిపోయింది.. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నాల్గవ టవర్ నుండి పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులలో ముగ్గురు నివాసితులు, ఇద్దరు కాశ్మీర్‌కు చెందినవారు.. ఒకరు రాజస్థాన్‌కు చెందినవారు ఉన్నారు.. ఈ సంఘటనకు గల ఖచ్చితమైన కారణాన్ని దర్యాప్తు చేస్తున్నామని.. అని గోద్రా-పంచమహల్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవీంద్ర అసరి చెప్పారు. పోలీసులు బాధితులను గుర్తించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాళికా మాత ఆలయానికి యాత్రికులను తీసుకెళ్లే ప్యాసింజర్ రోప్‌వే చెడు వాతావరణం కారణంగా మూసివేయబడింది.. అయితే గూడ్స్ రోప్‌వే కొనసాగుతున్న నిర్మాణ కార్యకలాపాలకు ఉపయోగంలో ఉంది. తాడు తెగిపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి.. పంచమహల్ జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ట్రాలీ దాని లోడ్ సామర్థ్యానికి మించి వస్తువులను తీసుకువెళుతుందా.. సాధారణ తనిఖీలలో లోపాలు ఉన్నాయా అని అధికారులు పరిశీలిస్తున్నారని ఓ అధికారి తెలిపారు.

వీడియో చూడండి..

మోనో-కేబుల్ గొండోలా సిస్టమ్ కు చెందిన పావగడ రోప్‌వేను 1986లో స్థాపించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన చంపానేర్-పావగడ పురావస్తు ఉద్యానవనంలో ఉన్న బేస్ స్టేషన్ నుండి కాళికా మాత ఆలయం సమీపంలోకి యాత్రికులను రవాణా చేస్తుంది. అయితే.. ఈ సౌకర్యాలను మరింత అప్‌గ్రేడ్ చేయడానికి.. యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..