AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు ట్రాఫిక్‌ కష్టాలపై ప్రముఖుల ఆగ్రహం.. వైజాగ్‌ రావాలంటూ మంత్రి లోకేష్‌ ఆహ్వానం..

ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడితే వాహనాలు ఆగిపోతాయి, కాని ఆ నగరంలో ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా ఏకంగా కంపెనీలు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ ట్రాఫిక్‌ నరకాన్ని సరిదిద్దకపోతే ఇక అంతే అంటూ ప్రముఖులు కూడా నిలదీస్తున్న పరిస్థితి.. ఈ క్రమంలోనే నారా లోకేశ్ వైజాగ్ వచ్చేయండి అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

బెంగళూరు ట్రాఫిక్‌ కష్టాలపై ప్రముఖుల ఆగ్రహం.. వైజాగ్‌ రావాలంటూ మంత్రి లోకేష్‌ ఆహ్వానం..
Bengaluru Roads
Shaik Madar Saheb
|

Updated on: Sep 17, 2025 | 8:31 PM

Share

ఒక్కప్పుడు గార్డెన్ సిటీ ఆఫ్‌ ఇండియాగా పేరు తెచ్చుకున్న బెంగళూరు నేడు ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వరస్ట్‌ ట్రాఫిక్‌ సిటీగా మారిపోయింది. ట్రాఫిక్‌ జామ్స్‌ కారణంగా ప్రజలు రోడ్లపై చిక్కుకుపోవడంతో బెంగళూరు నగరం ఏటా కోల్పోయే మొత్తం 20వేల కోట్ల రూపాయలంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. బెంగళూరు మొత్తం కలిపితే రోజు కనీసం 800 కిలోమీటర్ల ట్రాఫిక్‌ జామ్‌ ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ రోడ్డు మీద ప్రయాణం ఎలా ఉంటుందో.. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలోని ఐటీ రాజధాని బెంగళూరుకు ప్రత్యామ్నాయ కేంద్రంగా వైజాగ్‌ను తీర్చిదిద్దుతున్నామని.. స్వయంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి హింట్ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. అంతేకాకుండా విశాఖపట్నం అత్యంత సురక్షితమైన నగరమని.. ఇక్కడికి వచ్చేయండి అంటూ కంపెనీలకు ఆహ్వానించారు నారా లోకేష్.. బెంగళూరు ఎలా ఏర్పడిందంటే.. గుట్టలపై ఉన్న హరళూరు, కడుబీసనహళ్లి వంటి కొన్ని గ్రామాలతో బెంగళూరు ఏర్పడింది. వచ్చే దశాబ్దానికి బెంగళూరు ఏర్పడి ఐదొందల ఏళ్లవుతుంది. అక్కడ చాలా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు అవకాశం లేదు, కాని అదే సమయంలో భవనాలు, ఆకాశహర్మ్యాలు మాత్రం లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్‌ గురించి మాట్లాడేందుకు కారణం లేకపోలేదు. బెంగళూరుకు చెందిన లాజిస్టిక్స్‌ టెక్‌ కంపెనీ బ్లాక్‌బక్‌ – సహ వ్యవస్థాపకుడు, CEO రాజేశ్‌ యాబాజీ చేసిన ట్వీట్‌ బెంగళూరులో ట్రాఫిక్‌ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చెప్తోంది. తొమ్మిదేళ్లు బెంగళూరు బెలందూరులోనే తన ఇల్లు, ఆఫీసు ఉందని, కాని ఇప్పుడు అక్కడ ఉండటం కష్టంగా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి