Rice Price to Hike: బియ్యం రేట్లు పెరుగుతున్నాయ్‌.. ఇప్పుడే కొనేయండి!

|

Jul 06, 2023 | 1:01 PM

దేశ వ్యాప్తంగా పప్పు ధాన్యాల రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్నడూలేని విధంగా 11 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే బాటలో బియ్యం రేట్లు కూడా..

Rice Price to Hike: బియ్యం రేట్లు పెరుగుతున్నాయ్‌.. ఇప్పుడే కొనేయండి!
Rice Price To Hike
Follow us on

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పప్పు ధాన్యాల రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్నడూలేని విధంగా 11 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే బాటలో బియ్యం రేట్లు కూడా పరుగులు పెట్టనున్నాయి. ప్రపంచంలోని వరి బియ్యం ఎగుమతుల్లో 40 శాతం భారత్‌ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వరి ధరలు మరింత పెరగనున్నాయి. గత నెలలో కేంద్రం వరి బియ్యం ధరలను 7% పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ బియ్యం ఎగుమతుల మద్ధతు ధర 9% పెరిగి ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.

దేశ వ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా ప్రజలకు వరి ప్రధాన ఆహారం. దాదాపు 90% వరి పంట ఆసియాలోనే ఉత్పత్తి అవుతుంది. వరి ప్రధానంగా నీటి ఆధారిత పంట. ఐతే ఎల్‌ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఎన్ నినో ప్రభావం ప్రపంచంలోని ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎల్‌ నినో ప్రభావం చూపనుంది. దీంతో ఈ ఏడాది వరి పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ బియ్యం ధర సూచిక 11 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది.

తక్కువ ఆహార నిల్వలు, గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా వరుస దాడులు, అనిశ్చితి వాతావరణం కారణంగా ఆహార ధరలు పెరిగాయి. కొత్తగా ప్రవేశ పెట్టిన కనీస మద్దతు ధర కారణంగా దేశంలో ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో ఇతర సరఫరాదారులు కూడా ధరలను పెంచడం ప్రారంభించారని రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (REA) అధ్యక్షుడు బీవీ కృష్ణారావు తెలిపాడు. 2023/24 చివరి నాటికి గ్లోబల్ బియ్యం నిల్వలు ఆరేళ్ల కనిష్ట స్థాయి 170.2 మిలియన్ టన్నులకు పడిపోనున్నాయి. వరి దిగుబడి తగ్గిపోతే ధరలు 5 లేదా అంతకంటే ఎక్కువ రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.