AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టింటికి వచ్చిన వివాహితను గర్భం చేశాడు.. చివరికి ఊహించని ట్విస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని మేరట్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెళ్లైన మహిళకు గర్భం చేసి.. హత్య చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే మేరట్‌లోని ఓ మహిళకు 2015లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమె భర్తతో తనకు తరచుగా గొడవలు జరగుతుండేవి. ఈ గొడవలను ఆమె భరించలేకపోయింది.

పుట్టింటికి వచ్చిన వివాహితను గర్భం చేశాడు.. చివరికి ఊహించని ట్విస్ట్
Lovers
Aravind B
|

Updated on: Jul 06, 2023 | 1:03 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మేరట్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెళ్లైన మహిళకు గర్భం చేసి.. హత్య చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే మేరట్‌లోని ఓ మహిళకు 2015లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమె భర్తతో తనకు తరచుగా గొడవలు జరగుతుండేవి. ఈ గొడవలను ఆమె భరించలేకపోయింది. పెళ్లైన ఏడాదికే తన పుట్టింటికి వచ్చేసింది. అప్పటినుంచి తన ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఆదేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దీంతో వాళ్లిద్దరు శారీరకంగా కూడా కలుసుకున్నారు. అయితే కొనాళ్లకు ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆదేశ్‌కు చెప్పింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరింది. కానీ ఆదేశ్ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. ఆమెను ఒదిలించుకోవడం కోసం తప్పించుకుంటూ తిరిగేవాడు.

కానీ ఆ మహిళ మాత్రం వెనక్కి తగ్గలేదు. తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. దీంతో ఆదేశ్ ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు. తన స్నేహితులతో కలిసి ఆమె హత్య చేసేలా పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఓ రోజు ఆమెతో మాట్లాడాడు. తన ఇంటికి రావాలంటూ పిలిచాడు. అతడ్ని నమ్మిన ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత అతడు తన స్నేహితులతో కలిసి పెద్ద బండరాయితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. 3 రోజుల తర్వాత దగ్గర్లోని పొలంలో ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తన బిడ్డను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు ఆదేశ్, దీపక్‌, ఆర్యన్‌, సందీప్‌, రోహిత్‌లను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి