AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్ట్‌లు.. కేసును పోలీసులు ఎలా ఛేదించారో తెలిస్తే!

మధ్యప్రదేశ్‌ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. తండ్రి చావుకు కారణమైన తమ్ముడిపై పగ పెంచుకున్న అన్న సుమారు 8 ఏళ్ల తర్వాత అతన్ని అతికిరాతకంగా హత్యచేయించాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా తమ్ముడి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నాడు. ఆ తర్వాత విదేశాలకు పారిపోయాడు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. సుమారు 500 సీసీ ఫటేజ్‌లు పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించారు.

థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్ట్‌లు.. కేసును పోలీసులు ఎలా ఛేదించారో తెలిస్తే!
Revenge Killing In Madhya P
Anand T
|

Updated on: Aug 06, 2025 | 3:44 PM

Share

తండ్రిని చంపిన తమ్ముడిపై పగ పెంచుకున్న ఓ అన్నయ్య ఎనిమిదేళ్ల తర్వాత అతన్ని కిరాతకంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివపురి ప్రాంతానికి చెందిన హనుమాన్ సింగ్ తోమర్‌ అనే వ్యక్తికి ఇద్దరు కుమారు ఉన్నారు. పెద్దకుమారుడు భాను, చిన్న కుమారుడు అజయ్ తోమర్, హనుమాన్‌ సింగ్‌ పోలీస్‌గా విధులు నిర్వహించి రిటైర్‌ అయ్యారు. అయితే 2017లో హనుమాన్ సింగ్ తోమర్‌ను కొందరు కాల్చి గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ సమయంలో అతని చిన్న‌ కుమారుడు అజ‌య్‌ తోమర్ మాత్రం త్రుటిలో తప్పించుకున్నాడు.

అయితే ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ హత్య కేసులో ఆయన చిన్నకుమారు అజయ్‌ తోమర్‌ పాత్ర ఉన్నట్టు గుర్తించారు. దీంతో అజయ్‌కు కోర్టు జీవిత ఖైదు ప‌డింది. అయితే ఈ విషం తెలుసుకున్న అన్న భాను తోమర్ తమ్ముడి అజయ్‌పై పగ పెంచుకున్నారు. అతన్ని చంపాలనే ప్రతీకారంతో ర‌గిలిపోయాడు. అయితే గత నెలలో అజయ్ బెయిల్‌ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. విషయం తెలుసకున్న భాను తోమర్ అతన్ని హత్య చేసుందుకు ప్లాన్ వేశాడు.

ఇందుకోసం కిరాయి హంతకులతో భాను డీల్‌ కుదర్చుకున్నాడు. పథకం ప్రకారం తన దగ్గరి బంధువులైన మోనేశ్‌, 17 ఏళ్ల బాలిక సహాయంతో అజయ్‌ హత్యకు ప్లాన్‌ను ఎగ్జుక్యూట్‌ చేశాడు. బాలికను అజయ్‌ను కారులో ఎక్కించి అతన్ని శివపురి-గ్వాలియర్ హైవే వైపు తీసుకురమ్మని చెప్పాడు. అలానే అతన్ని అటువైపుగా తీసుకొచ్చిన బాలిక మార్గమధ్యలో ఓ పెట్రోల్ పంపు దగ్గర కారు ఆపమని కోరింది. కారు ఆపిన వెంటనే బాలిక దిగి పక్కకు వెళ్లిపోయింది. అయితే అప్పటికే అక్కడ వేచి ఉన్న దుండగులు అజయ్‌పై తుపాకులతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో అజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే తనకు ఏమి తెలియనట్టు భాను విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియలు జరిపించాడు. అంత్యక్రియల్లో పాల్గొని తమ్ముడి మృతదేహాం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక అన్ని కార్యక్రమాలు ఆయిపోయాక చెప్పా పెట్టకుండా విదేశాలకు పారిపోయాడు. అయితే ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. సుమారు 500లకు సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించారు. నిందితులు హత్యకు వినియోగించ కారు భాను తోమర్‌ పేరుతో ఉండడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో కనిపించిన నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు ఈ హత్యలో ప్రధాన సూత్రదారుడు భానుతోమరే అని తెలిసి షాక్‌ అయ్యారు. హత్యకు సహకరించిన మోనేశ్‌, మైనర్ బాలికను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని నిర్ధారించారు. త్వరలోనే కీలక సూత్రదారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.