Republic Day: గణతంత్ర వేడుకలకు ముస్తాబైన ఢిల్లీ.. రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా జెండా ఎగరవేయనున్న ముర్ము
ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా హాజరుకానున్నారు. కాగా గణతంత్ర వేడుకల సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 6వేల మంది భద్రతా సిబ్బంది గస్తీ కాయనున్నారు. అలాగే సందర్శకులకు క్యూ ఆర్ కోడ్‌లతో కూడిన పాస్‌లు జారీ చేయనున్నారు.
రిపబ్లిక్ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్య పథ్‌లో నిర్వహించే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. జాతీయ గీతం ఆలపించాక పరేడ్ జరుగుతుంది. కర్తవ్యపథ్‌లో జరిగే ఆర్మీ పరేడ్‌లో.. త్రివిధ దళాలు పాల్గొంటాయి. తమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ పరేడ్ జరగనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ ట్యాంకులు..ఈసారి పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కాగా ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా హాజరుకానున్నారు. కాగా గణతంత్ర వేడుకల సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 6వేల మంది భద్రతా సిబ్బంది గస్తీ కాయనున్నారు. అలాగే సందర్శకులకు క్యూ ఆర్ కోడ్‌లతో కూడిన పాస్‌లు జారీ చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ..
ఇక విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో..జాతీయ జెండా ఎగురవేయనున్నారు గవర్నర్. ఈ వేడకలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఇక తెలంగాణ రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలకు విస్తృత ఏర్పాట్లు జరగనున్నాయి. గవర్నర్ తమిళిసై జెండా ఆవిష్కరించనున్నారు. రాజ్‌భవన్‌లోనే పరేడ్ నిర్వహించనుంది ప్రభుత్వం. ఇక ప్రగతిభవన్‌లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
President Droupadi Murmu received President Abdel Fattah El-Sisi of Egypt at Rashtrapati Bhavan and hosted a banquet in his honour. The President said that India appreciates Egypt’s leading role in promoting peace, prosperity and stability in the West Asia region. pic.twitter.com/V4fC05U6RO
— President of India (@rashtrapatibhvn) January 25, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..