Supreme Court: GSTపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలున్నాయని వ్యాఖ్యలు..
GSTకి సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని చెప్పింది. పార్లమెంట్, రాష్ట్రాలు అవసరమైతే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని పేర్కొంది...
GSTకి సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని చెప్పింది. పార్లమెంట్, రాష్ట్రాలు అవసరమైతే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని పేర్కొంది. వస్తు సేవల పన్ను (GST)పై చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర, రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయని జస్టిస్ డివై చంద్రచూడ్(Justice DY Chandrachud ) నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆచరణీయ పరిష్కారాన్ని సాధించడానికి జీఎస్‌టీ కౌన్సిల్ సామరస్యపూర్వకంగా పని చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఆర్టికల్ 246ఏ ప్రకారం పన్నులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చని తెలిపింది. ఒకరి ఆదేశాలను మరొకరిపై రుద్దవద్దని పేర్కొంది.
2007 ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (IGST) చట్టం ప్రకారం సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించిన గుజరాత్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌పై సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. ఓడలో వస్తువుల రవాణా సేవలపై ఐదు శాతం ఐజీఎస్టీ విధించాలని 2017 ప్రభుత్వ నోటిపికేషన్‌ను హైకోర్టు రద్దు చేయడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు. కాగా GST, IGST రూపాల్లో ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి