AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎకనమిక్ సర్వే లో జీడీపీ వృద్ది రేటు ఎంత ?

2019-20 సంవత్సరానికి స్థూల దేశీయ వృద్ది (జీడీపీ) రేటును 7 శాతం గా ఆర్ధిక సర్వే పేర్కొంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉన్న విషయాన్ని ఈ సర్వే గుర్తు చేసింది. ఈ సర్వే ను గురువారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. దేశంలో మరిన్ని ఉద్యోగాల కల్పనకోసం కార్మిక చట్టాలను డీరెగ్యులరైజ్ చేయాలని, పబ్లిక్ సెక్టార్ తో చేతులు కలిపి ప్రయివేటు ఇన్వెస్టిమెంట్లను సమీకరించాలని ఈ సర్వే సూచించింది. చీఫ్ […]

ఎకనమిక్ సర్వే లో జీడీపీ వృద్ది  రేటు ఎంత ?
Pardhasaradhi Peri
|

Updated on: Jul 04, 2019 | 4:44 PM

Share

2019-20 సంవత్సరానికి స్థూల దేశీయ వృద్ది (జీడీపీ) రేటును 7 శాతం గా ఆర్ధిక సర్వే పేర్కొంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉన్న విషయాన్ని ఈ సర్వే గుర్తు చేసింది. ఈ సర్వే ను గురువారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. దేశంలో మరిన్ని ఉద్యోగాల కల్పనకోసం కార్మిక చట్టాలను డీరెగ్యులరైజ్ చేయాలని, పబ్లిక్ సెక్టార్ తో చేతులు కలిపి ప్రయివేటు ఇన్వెస్టిమెంట్లను సమీకరించాలని ఈ సర్వే సూచించింది. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ రూపొందించిన ఈ ఎకనామిక్ సర్వే ..తిరిగి ఎన్నికైన మోదీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మొట్టమొదటిది. దీని అంచనా ప్రకారం.. జీడీపీ 7 శాతం వృద్దినే చేరుకుంటే అది చైనాను అధిగమించి వాల్డ్ లోనే అతి పెద్ద ఎకానమీని సాధించిన దేశంగా ఇండియా ఎదగడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రాల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పన్నుల వసూళ్లు తగ్గినందున.. ఆర్ధిక వృద్ది కూడా మందగించింది.. ఫలితంగా ఈ దేశం పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది.. అయితే బ్యాంకు రుణాలు, కన్స్యూమర్ డిమాండ్ మెరుగు పడిన పక్షంలో రాబోయే నెలల్లో ఇన్వెస్టిమెంట్ రేట్లు పెరగవచ్చునని, దాంతో పరిస్థితి బెటర్ అన్న చందంగా ఉంటుందని ఈ సర్వే అభిప్రాయపడింది. కాగా-ఈ ఎకనామిక్ సర్వేపై స్పందించిన ప్రధాని మోదీ.. ఇండియా 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల మేర ఆర్ధికంగా పుంజుకునేందుకు రోడ్ మ్యాప్ గా ఈ నివేదిక ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు. సామాజిక రంగంలో అభివృధ్ది, టెక్నాలజీ అడాప్షన్, ఎనర్జీ సెక్యూరిటీ… ఈ మూడూ ప్రధానంగా ఈ ‘ విజన్ ‘ కు తోడ్పడతాయని ఆయన అన్నారు. అంటే రాబోయే రోజుల్లో టెక్నాలజీని మరింత అభివృధ్ది పరచుకుని.. ఇంధనం తదితర రంగాల్లో పురోగతి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన వివరించారు. ఆర్ధిక శాఖ వెబ్ సైట్ ప్రచురించిన డాక్యుమెంటును మోదీ ఈ ట్వీట్ కు జత చేశారు. 2020 లో ఆర్ధిక వృద్ది 7 శాతానికి పెరగగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సూక్ష్మ స్థాయి పరిశీలనలు, కృషి గతంలో మాదిరే కొనసాగుతాయని, అందువల్ల 2019-20 లో ఎకానమీ వృద్ది సాధ్యమేనని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ప్రస్తావించిన అంశాన్ని అయన గుర్తు చేశారు. దేశంలో అనేక చోట్ల వర్షపాతం తగ్గిన ఫలితంగా వ్యవసాయ రంగ పురోగతి కూడా తగ్గిందని, ఫలితంగా ఆదాయం పై దీని ప్రభావం పడి.. సుమారు 15 శాతం రెవెన్యూ తగ్గుదల కనిపించిందని ఈ సర్వే పేర్కొంది. గ్రామీణ ‘ కష్టాలు ‘ మొదలయ్యాయి.. రైతులు దిగాలు పడుతున్నారు. అందువల్ల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టాల్సివచ్చింది… అని ఈ నివేదిక తెలిపింది. అయితే బ్యాంకింగ్ సంస్కరణలు, తదితర చర్యల ద్వారా పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చునన్న ఆశాభావాన్ని ఆర్ధిక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.