పన్ను రాయితీలపై మిడిల్ క్లాస్ ఆశలు
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ పై ముఖ్యంగా సామాన్యులు, మధ్యతరగతి వర్గాలవారు కొండంత ఆశలు పెట్టుకున్నారు.పన్ను శ్లాబులను మోదీ ప్రభుత్వం తగ్గిస్తుందని, పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రెండున్నర లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతుందని వారు ఆశిస్తున్నారు. అయితే దేశ ఆర్ధిక వృద్ది తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకు పూనుకోకపోవచ్చు. పైగా పన్ను మినహాయింపు పరిమితిని పెంచిన పక్షంలో ప్రస్తుత టాక్స్ బేస్ తగ్గవచ్ఛునని సర్కార్ భావిస్తోంది. అందువల్ల ఇందులో మార్పు […]

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ పై ముఖ్యంగా సామాన్యులు, మధ్యతరగతి వర్గాలవారు కొండంత ఆశలు పెట్టుకున్నారు.పన్ను శ్లాబులను మోదీ ప్రభుత్వం తగ్గిస్తుందని, పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రెండున్నర లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతుందని వారు ఆశిస్తున్నారు. అయితే దేశ ఆర్ధిక వృద్ది తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకు పూనుకోకపోవచ్చు. పైగా పన్ను మినహాయింపు పరిమితిని పెంచిన పక్షంలో ప్రస్తుత టాక్స్ బేస్ తగ్గవచ్ఛునని సర్కార్ భావిస్తోంది. అందువల్ల ఇందులో మార్పు ఉండకపోవచ్ఛు. కొన్ని చెల్లింపులు, ఇన్వెస్టిమెంట్లకు 80 సి సెక్షన్ కింద ప్రస్తుతమున్న రూ. 1. 5 లక్షల డిడక్షన్ పరిమితిని పెంచాలని కూడా కొన్ని వర్గాలు కోరుతున్నాయి. గత ఐదేళ్లలో ఇది మారలేదు. ఫలితంగా ఈ లిమిట్ ని 2 లక్షలకు పెంచే విషయాన్ని ఆర్ధిక శాఖ పరిశీలించే సూచనలున్నాయని అంటున్నారు. గృహ రుణాలపై వడ్డీ చెల్లింపును కూడా అధికారులు తగ్గించవచ్చునని భావిస్తున్నారు. 2022 కల్లా దేశంలో అందరికీ గృహవసతి కల్పించాలన్నదే లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం గమనార్హం. అందువల్ల డిడక్షన్ పరిమితిని రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచవచ్చునని అంటున్నారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లల్లో ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన డిడక్షన్ ను రూ. 50 వేల వరకు పెంచిన విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలు వస్తున్నాయి.



