Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: దేశంలో త్వరలో 8 కోత్త బ్యాంకులు… విషయాన్ని వెల్లడించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

RBI New Banks: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక విషయాన్ని వెల్లడించింది. కొత్తగా బ్యాంకుల ఏర్పాటు కోసం తమ వద్ద 8 దఖాస్తులు వచ్చాయని తెలిపింది....

RBI: దేశంలో త్వరలో 8 కోత్త బ్యాంకులు... విషయాన్ని వెల్లడించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
Rbi
Follow us
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 17, 2021 | 8:34 AM

RBI New Banks: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక విషయాన్ని వెల్లడించింది. కొత్తగా బ్యాంకుల ఏర్పాటు కోసం తమ వద్ద 8 దఖాస్తులు వచ్చాయని తెలిపింది. యూనివర్సల్‌ ప్రైవేట్‌ బ్యాంక్‌, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ఏర్పాటు కోసం అవసరమైన లైసెన్స్‌ పొందడం కోసం దరఖాస్తులు వచ్చినట్ల ఆర్బీఐ తెలిపింది. యూనివ్సల్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ కోసం నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో యూఏఈ ఎక్స్చేంజ్ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, రెప్కో బ్యాంక్‌, చైతన్య ఇండియా ఫిన్‌ క్రెడిట్‌, పంకజ్ వైశ్ అండ్ అదర్స్ అనే సంస్థలు ఉన్నాయి. వీటిల్లో చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ సంస్థకు ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ సారథ్యం వహిస్తున్నట్లు సమాచారం.

అలాగే మరో నాలుగు బ్యాంకులు స్మాల్‌ ఫైనాన్స్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపింది. వీటిల్లో వీసాప్ట్‌ టెక్నాలజీస్‌, కాలికట్‌ సిటీ సర్వీస్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు, అఖిల్‌ కుమార్‌ గుప్తా, ద్వారా క్షేత్రియ గ్రామీణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనే సంస్థలు ఉన్నాయి. ఆర్బీఐ 2016లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన సంస్థలు బ్యాంక్ లైసెన్స్ పొందొచ్చు.

అయితే యూనివర్సల్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ పొందాలని భావించే వ్యక్తులు కనీసం పదేళ్లు బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ రంగంలో సీనియర్‌ లెవెల్‌ బాధ్యతలు నిర్వహించి ఉండాలి. అదే ప్రైవేటు కంపెనీలు, సంస్థలు అయితే పదేళ్ల ట్రాక్స్‌ రికార్డుతో పాటు రూ.5 వేల కోట్లకుపైగా అసెట్స్‌ కలిగి ఉండాలి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కూడా దాదాపు ఇదే నిబంధనలు వర్తిస్తాయి.

ఇవీ చదవండి: SBI Insurance: కస్టమర్లకు శుభవార్త.. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల లైఫ్‌ కవరేజీతో ఇన్సూరెన్స్‌

Covid-19: కరోనా నుంచి రక్షించుకునేందుకు కొత్త పాలసీలు..5 లక్షల వరకు కవరేజీ.. ప్రీమియం ఎంతంటే..!