RBI Recruitment 2023: నెలకు రూ.71,032 జీతంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. డిగ్రీ/డిప్లొమా అర్హతతో బ్యాంక్‌ జాబ్స్

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. 35 జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

RBI Recruitment 2023: నెలకు రూ.71,032 జీతంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. డిగ్రీ/డిప్లొమా అర్హతతో బ్యాంక్‌ జాబ్స్
RBI
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 11, 2023 | 8:44 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. 35 జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూన్‌ 1, 2023వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన వారు రూ.450, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.50 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జులై 15వ తేదీన ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.33,900ల నుంచి రూ.71,032 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

మొత్తం 300 మార్కులకు 2:30 గంటల సమయంలో 180 ప్రశ్నలకు సమాధానం రాయవల్సి ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వెజ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌ పేపర్‌ 1లో 40 ప్రశ్నలకు 100 మార్కులు, ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌ పేపర్‌ 2లో 40 ప్రశ్నలకు 100 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు చేయవద్దు.. భారీ నష్టం కలుగుతుంది..
మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు చేయవద్దు.. భారీ నష్టం కలుగుతుంది..
ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి ఇన్ని ఉపయోగాలా?
ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి ఇన్ని ఉపయోగాలా?
ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
వాస్తు పరంగా మీ ఇళ్లు ఇలా ఉంటే ఆర్థికంగా ఢోకా ఉండదు..!
వాస్తు పరంగా మీ ఇళ్లు ఇలా ఉంటే ఆర్థికంగా ఢోకా ఉండదు..!
నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది..
నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది..
కొత్త బడ్జెట్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం.. నిపుణుల విశ్లేషణలివే
కొత్త బడ్జెట్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం.. నిపుణుల విశ్లేషణలివే
మహాకుంభకు వెళ్తున్నారా మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ లిస్టు ఇదిగో
మహాకుంభకు వెళ్తున్నారా మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ లిస్టు ఇదిగో