RBI: రూ.2వేల నోట్లతో పోలిస్తే రూ.500 నకిలీ నోట్లే ఎక్కవ.. ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు

|

May 30, 2023 | 8:42 PM

రూ.2000 నోట్లతో పోలిస్తే.. రూ.500 డినామినేష‌న్‌కు చెందిన న‌కిలీ నోట్లే చాలా ఎక్కువగా చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ త‌న నివేదిక‌లో పేర్కొంది. 2022-23 సీజ‌న్‌లో రూ.500 డినామినేష‌న్‌కు చెందిన 14.4 శాతం న‌కిలీ నోట్లను గుర్తించిన‌ట్లు త‌న వార్షిక నివేదిక‌లో పేర్కొంది.

RBI: రూ.2వేల నోట్లతో పోలిస్తే రూ.500 నకిలీ నోట్లే ఎక్కవ.. ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు
Money
Follow us on

రూ.2000 నోట్లతో పోలిస్తే.. రూ.500 డినామినేష‌న్‌కు చెందిన న‌కిలీ నోట్లే చాలా ఎక్కువగా చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ త‌న నివేదిక‌లో పేర్కొంది. 2022-23 సీజ‌న్‌లో రూ.500 డినామినేష‌న్‌కు చెందిన 14.4 శాతం న‌కిలీ నోట్లను గుర్తించిన‌ట్లు త‌న వార్షిక నివేదిక‌లో పేర్కొంది. గ‌త ఏడాది రూ.500కు చెందిన 91,110 నోట్లను గుర్తించిన‌ట్లు తెలిపింది. ఇక అదే ఏడాదిలో రూ.2000 నోట్లలో కేవ‌లం 9806 పీసులు మాత్రమే న‌కిలీవి వెళ్లిన‌ట్లు వెల్లడించింది.

అలాగే రూ.20కు చెందిన నోట్లల్లో కూడా 8.4 శాతం నోట్లు న‌కిలీవని తేలినట్లు ఆర్బీఐ తెలిపింది. రూ.10, రూ.100, రూ.2000 నోట్లల్లో న‌కిలీ నోట్లు 11.6 శాతం ప‌డిపోయిన‌ట్లు చెప్పింది. ఫేక్ ఇండియ‌న్ క‌రెన్సీ నోట్స్‌ ప్రకారం 2022-23లో 2,25,769 ఫేక్ నోట్లు వచ్చాయి. అంతకుముందు సంవత్సరం 2,30,971 న‌కిలీ నోట్లు వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ త‌న నివేదిక‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా ఫేక్ నోట్లలో 4.6 శాతం నోట్లను రిజ‌ర్వ్ బ్యాంక్ గుర్తించింది. అలాగే ఇత‌ర బ్యాంకులు 95.4 శాతం నకిలీ నోట్లు గుర్తించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..