Ratan Tata: మరోమారు నెటిజన్లను ఆకట్టుకున్న రతన్ టాటా..సింప్లిసిటీకి ప్రజలు ఫిదా!
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఎవరో అందరికీ తెలుసు..ఆయన సరళత్వం, వినయం, దేశభక్తి గురించిన కథలు మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. రతన్ టాటాకు సవాళ్లంటే చాలా ఇష్టమని చెబుతారు.
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఎవరో అందరికీ తెలుసు..ఆయన సరళత్వం, వినయం, దేశభక్తి గురించిన కథలు మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. రతన్ టాటాకు సవాళ్లంటే చాలా ఇష్టమని చెబుతారు. అతను దానిని పదే పదే నిరూపించాడు. సామాన్య భారతీయులకు అందుబాటు ధరలో కారు కావాలని కలలు కన్నాడు. ఈ వాహనం పేరు నానో. మార్కెటింగ్, ఇతర లోపాల కారణంగా ఈ వాహనం పెద్దగా అమ్ముడవలేకపోయినప్పటికీ, ఇది సామాన్య భారతీయుల ఎంపికగా మారింది. తాజాగా రతన్ టాటాకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. రతన్ టాటా నానో చిన్న కారులో బాడీగార్డ్ లేకుండా కూర్చున్న దృశ్యాలు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.. ఈ వీడియోలో బాడీగార్డ్ లేకుండా చిన్న కారులో టాటా ప్రయాణిస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది.
ఇంత సింప్లిసిటీతో రతన్ టాటా నానో నుంచి దిగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. రతన్ టాటా మెర్సిడెస్-బిఎమ్‌డబ్ల్యూకి బదులుగా ఫ్లాప్ అయిన టాటా నానో కారులో రావడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. విలాసవంతమైన వాహనాలకు బదులుగా చిన్న టాటా నానో కారులో హోటల్ తాజ్ చేరుకున్నారు. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి రతన్ టాటా నానో కారులో వచ్చారు. ఆయన పక్కన బాడీగార్డ్స్ కూడా లేరు. ఆ సమయానికి హోటల్ సిబ్బంది వచ్చి టాటాను రిసీవ్ చేసుకున్నారు. ఈ వీడియోను దేశంలోని ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ వైరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను 1 లక్ష 23 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో దీనిపై అనేక కామెంట్లు కూడా వస్తున్నాయి.
View this post on Instagram