వింత ప్రేమ.. విద్యార్ధినిని పెళ్లాడేందుకు పురుషుడిగా మారిన టీచర్‌!

|

Nov 09, 2022 | 7:38 PM

ప్రేమకు అసాధ్యమనేదే లేదని ఈ జంట నిరూపించింది. ఓ స్కూల్లో పీఈటీగా పనిచేసే టీచర్‌ అదే స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధినితో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి ప్రేమాయణంలో అసలు ట్విస్ట్‌.. ఇద్దరూ ఆడవాళ్లే అవ్వడం..

వింత ప్రేమ.. విద్యార్ధినిని పెళ్లాడేందుకు పురుషుడిగా మారిన టీచర్‌!
Teacher changes gender to marry student
Follow us on

ప్రేమకు అసాధ్యమనేదే లేదని ఈ జంట నిరూపించింది. ఓ స్కూల్లో పీఈటీగా పనిచేసే టీచర్‌ అదే స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధినితో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి ప్రేమాయణంలో అసలు ట్విస్ట్‌.. ఇద్దరూ ఆడవాళ్లే అవ్వడం. దీంతో టీచర్‌ లింగమార్పిడి ద్వారా పురుషుడిగా మారి శిష్యురాలిని వివాహం చేసుకుని తమ ప్రేమను గెలిపించుకున్నారు. ఎక్కడ జరిగిందంటే..

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మీరా (29) ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (పీఈటీ) గా పనిచేసేవారు. ఐతే కబడ్డీ ప్లేయర్‌ అయిన కల్పన ఫౌజ్‌దర్‌ అనే స్టూడెంట్‌ దుబాయ్‌లో నిర్వహించిన ఇంటర్నేషన్‌ కబడ్డీ టోర్నమెంట్‌కు వెళ్లింది. ఇదే సమయంలో మీరాకు కల్పన పరిచయం అయ్యింది. వీరి పరిచయం కాస్తా అనతికాలంలోనే ప్రేమగా మారింది. ఐతే కల్పన పరిచయమైనప్పటి నుంచి తాను అమ్మాయిగా ఎందుకు పుట్టానా? అని మదనపడిపోయేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా మీరా అబ్బాయిగా మారాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2019 డిసెంబర్‌ 25న తొలిసారి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నారు. పలు దఫాల తర్వాత.. 2021 డిసెంబర్‌లో శస్త్రచికిత్స పూర్తైంది. ఆ తర్వాత తన పేరును ఆరవ్‌ కుంతల్‌గా మార్చుకున్నారు. దీంతో ఇరువురి కుటుంబాల అంగీకారం మేరకు ఆదివారం (నవంబర్‌ 6) అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆరవ్‌ మీడియాతో మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

‘నాకు నలుగురు అక్కలు. అందరికీ పెళ్లిల్లయ్యాయి. నేను అమ్మాయిగా పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి అబ్బాయిగా ఉండాలనే అనిపించేది. అలాగే ప్రవర్తించేదాన్ని. రాఖీ పండగకి మా అక్కలు నాచేతికి రాఖీలు కట్టేవారు. అందుకే లింగమార్పిడి చేయించుకుంటానని కల్పనతో చెప్పాను. ఆమె అంగీకారం తెల్పింది. ఆపరేషన్‌ తర్వాత మా ఇరువురి కుటుంబాలు తమ అంగీకారాన్ని తెల్పడంతో ఇన్నాళ్లకు మాకల నెరవేరింది. ఐతే మహిళ నుంచి పురుషుడిగా తర్వాత నా ఉద్యోగ డాక్యుమెంట్లలో జండర్‌ మర్చుకోవడానికి చాలా కష్టపడ్డానని’ ఆరవ్‌ తెలిపారు.

ఆరవ్‌ తంగ్రి మాట్లాడుతూ.. నాకు ఐదుగురు కుమార్తెలు. చిన్న కూతురు మీరా చిన్నప్పటి నుంచి అబ్బాయిలా ప్రవర్తించేది. ఆటలు కూడా మగ పిల్లలతోనే ఆడేది. ఆపరేషన్ ద్వారా అబ్బాయిగా మారడంతో సంతోషంగా ఉందని మీడియాకు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.