Rajasthan Political Crisis: ఢిల్లీకి చేరిన రాజస్థాన్ గల్లీ పంచాయతీ.. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌కి పిలుపు
Ashok Gehlot Vs Sachin Pilot: అశోక్ గెహ్లాట్, సచిన్‌పైలట్ వర్గాలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. సీఎల్పీ భేటీని కూడా రద్దు చేసి, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లతో సహా సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా..

రాజస్థాన్‌లో కాంగ్రెస్ హైడ్రామా కంటిన్యూ అవుతోంది. గల్లీ కొట్లాట ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇప్పటివరకూ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఫలించకోవడంతో.. బంతి హైకమాండ్ కోర్టులోకి వెళ్లింది. అశోక్ గెహ్లాట్, సచిన్‌పైలట్ వర్గాలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. సీఎల్పీ భేటీని కూడా రద్దు చేసి, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లతో సహా సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా వెళ్లిన మల్లిఖార్జేన్ ఖర్గే , అజయ్ మాకెన్‌లను వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక రాజస్థాన్ పరిణామాలపై అధిష్టానం గెహ్లాట్‌ని ప్రశ్నించినా, పరిస్థితి తన చేతుల్లో లేదని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌కు బదులుగా మిస్టర్ గెహ్లాట్ లేదా ఆయన సూచించిన వ్యక్తిని ఎంపిక చేసి ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం గెహ్లాట్‌కి మద్దతుగా 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 200. కాంగ్రెస్‌కి 108 మంది శాసనసభ్యులున్నారు. బీజేపీకి 70 మంది, 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు. ఇతరులు మరో 8 మంది ఉన్నారు. ఈ ఈక్వేషన్స్‌లో తేడా వస్తే ఏం జరుగబోతోందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీకి సీఎం అశోక్ గెహ్లాట్..
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఢిల్లీకి వెళ్లవచ్చు, అక్కడ రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తారు. దీంతో పాటు సచిన్ పైలట్‌కు కూడా పార్టీ హైకమాండ్ సమన్లు పంపింది. గెహ్లాట్‌తో భేటీ అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. నిన్న జరిగిన విషయాన్ని పార్టీ అధ్యక్షుడికి తెలియజేశాం. చివరికి ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందే. పార్టీలో క్రమశిక్షణ ఉండాలి. గెహ్లాట్‌తో భేటీ మర్యాదపూర్వకంగా జరిగినట్లు ఖర్గే తెలిపారు. పార్టీ విచ్ఛిన్నం కాదు.. అందరూ ఐక్యంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు ఎవరైనా క్రమశిక్షణా రాహిత్యంగా ఉంటే తొలగించాలని అందులో ఎలాంటి అభిప్రాయం లేదన్నారు.
అజయ్ మాకెన్‌పై మల్లికార్జున ఖర్గే ..
మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. పార్టీని ఎలా పటిష్టం చేయాలన్నదే అందరి లక్ష్యం. మిగతా విషయాలపై ఢిల్లీలో చర్చిస్తాం. గెహ్లాట్‌పై అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తనకు తెలియదని దాటవేశారు.
ఎమ్మెల్యేల తిరుగుబాటుపై మాకెన్ ఫైర్..
అంతకుముందు అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో కొంతమంది ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష అధికారిక సమావేశానికి హాజరుకాకపోవడం, దానికి సమాంతరంగా మరే ఇతర సమావేశాన్ని నిర్వహించడం క్రమశిక్షణా రాహిత్యమని అన్నారు. షరతులతో కూడిన తీర్మానాన్ని ఆమోదించాలని ఎమ్మెల్యేల బృందం పట్టుబట్టిందన్నారు. కాగా, గెహ్లాట్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు సోమవారం మరోసారి సమావేశం కానున్నారు.
ఇదిలావుంటే.. గెహ్లాట్ సలహాదారు ఎమ్మెల్యే సన్యామ్ లోధా మాట్లాడుతూ.., “ఆదివారం పరిణామాలపై చర్చించడానికి ఈ రోజు సమావేశం ఉంటున్నారు. దీనికి ఇంకా సమయం నిర్ణయించలేదని తెలిపారు0. శాసనసభా పక్ష సమావేశానికి జైపూర్‌కు వచ్చిన పార్టీ పరిశీలకులు మాకెన్, మల్లికార్జున్ ఖర్గేలు సోమవారం ఢిల్లీకి తిరిగి వెళ్లారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక సమర్పించనున్నారు.
కాంగ్రెస్ విజయం వెనుక సచిన్ పైలట్..
వాస్తవానికి 2013 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. 200 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 21 మంది కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలిచారు.ఈ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ సచిన్ పైలట్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. రాష్ట్రంలో పార్టీని మరోసారి నిలబెట్టేందుకు పైలట్ శ్రమించారు. 2018 ఎన్నికలకు ముందు పైలట్ దాదాపు ఐదున్నర లక్షల కిలోమీటర్లు తిరిగి..కార్యకర్తల్లో ఉత్సాహం నిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే సచిన్ పైలట్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
అధికారంలోకి వచ్చినా దక్కని సీటు..
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పైలట్ సీఎం కాలేకపోయారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 100 సీట్లకు ఒక్కస్థానంతో వెనుకపడిపోయింది. అయితే, ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి..అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో రాజకీయంగా ప్రకంపనలు వచ్చాయి. కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ రాకపోవడంతో సచిన్ పైలట్ సీఎం పదవికి దూరమయ్యారు. సీనియర్ నేత అయిన అశోక్ గెహ్లాట్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు సాధించడంలో సక్సెస్ కావడంతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




