Rajasthan Election 2023: రాజస్థాన్ రాజకీయ మారుస్తున్న ధుంధార్.. ఈసారి ఎవరికి పట్టం కడుతుందో..!
రాజస్థాన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ధుంధార్ . ఈ ప్రాంతం రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను హీరా లాల్ శాస్త్రి, టికారామ్ పలివాల్ అందించిన ప్రాంతం. ప్రతి ఎన్నికల్లోనూ ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ధుంధర్ ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది.
రాజస్థాన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ధుంధార్ . ఈ ప్రాంతం రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను హీరా లాల్ శాస్త్రి, టికారామ్ పలివాల్ అందించిన ప్రాంతం. ప్రతి ఎన్నికల్లోనూ ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ధుంధర్ ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది.
రాజస్థాన్ తూర్పు మధ్య భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో జైపూర్, దౌసా, టోంక్ మరియు సవాయి మాధోపూర్ జిల్లాలు ఉన్నాయి. గతంలో ధుంధర్ ప్రాంతంలో 25 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీలిమిటేషన్ తర్వాత ఇప్పుడు ఆ సంఖ్య 32కి చేరింది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ ప్రాంత రాజకీయ సమీకరణం, ఇక్కడి ఫలితాలను కులం, రాజకుటుంబాలు ప్రభావితం చేస్తాయి.
ధోంధార్ పట్టణ ప్రాంతం బిజెపికి బలమైన కంచు కోటగా ఉంది. ముఖ్యంగా జైపూర్‌లో ఆ పార్టీకి మంచి పట్టుంది. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. వ్యాపారులు, రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులు ఎప్పుడూ బీజేపీ వెంటే ఉన్నారు. అంతే కాకుండా ఇక్కడ ఎస్సీ,ఎస్టీ వర్గాలకు కూడా ఆధిపత్యం ఉంది. ఈ ప్రాంతం నమో నారాయణ్ మీనా, కుంజి లాల్, జస్కౌర్ మీనా, కైలాష్ మేఘవాల్, ఖిలాడీ బైర్వా వంటి నాయకులను అందించడానికి కారణం ఇదే.
ఈ ప్రాంతంలోని అనేక నియోజకవర్గాల్లో గుర్జర్ సామాజికవర్గం కూడా గణనీయమైన సంఖ్యలో ఉంది. 2018 ఎన్నికల్లో గుజ్జర్లు ఏకపక్షంగా పార్టీకి అనుకూలంగా ఓటేశారని, అందుకే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ విజయం సాధించిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయితే, ఈసారి అది అంత ఈజీ కాదు. సచిన్ పైలట్‌ను సీఎం చేయకపోవడంతో గుర్జర్ ఓటర్లు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు.
కులం తర్వాత, జైపూర్ రాజకుటుంబం ఎక్కువ ప్రభావం చూపింది. మునుపటి జైపూర్ రాజకుటుంబం ఈ ప్రాంతానికి చాలా ఇచ్చింది. గాయత్రీ దేవి కుటుంబం రాష్ట్ర సెక్రటేరియట్, అసెంబ్లీ, SMS హాస్పిటల్‌తో పాటు మహారాజా, మహారాణి కళాశాలలను కూడా స్థాపించింది. 1962కి ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. అయితే గాయత్రీ దేవి నాయకత్వంలో స్వతంత్ర పార్టీ ఆవిర్భవించడంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పట్టు కోల్పోయింది. ఈసారి, జైపూర్ రాజకుటుంబం తిరిగి తమ సొంతగడ్డపైకి వచ్చిం. విద్యాధర్ నగర్ నియోజకవర్గం నుండి రాజ్‌సమంద్ ఎంపీ దియా కుమారిని బీజేపీ పోటీకి దింపింది.
2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 11 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 13 సీట్లు గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీ 2 స్థానాలు, లోక్తాంత్రిక్ సమాజ్ వాదీ పార్టీ 1 స్థానాల్లో విజయం సాధించాయి. తదనంతరం, 2013 అసెంబ్లీ ఎన్నికలలో, ఈ ప్రాంతంలో బిజెపి 28 సీట్లు గెలుచుకోగా, నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) రెండు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్, స్వతంత్రులు ఒక్కో సీటును గెలుచుకున్నారు. 2018లో ఇక్కడ కాంగ్రెస్ బలమైన పునరాగమనం చేసి 20 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు చెరో 6 సీట్లు గెలుచుకున్నారు. చూడాలి మరీ వచ్చే ఎన్నికల్లో ధుంధార్ ప్రాంత ప్రజలు ఎవరికి పట్టం కడతారో..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..