AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Trains: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. త్వరలోనే 200 కొత్త రైళ్లు.. వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి!

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. దేశంలో త్వరలోనే కొత్తగా సుమారు 200 రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రైల్వే ప్రయాణాలపై ప్రయాణికుల ఆసక్తి నేపథ్యంలో వారి సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్‌, 100 మెమూ రైళ్లు, 50 అమృత్‌ భారత్‌ రైళ్లును అంబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు

New Trains: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. త్వరలోనే 200 కొత్త రైళ్లు.. వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి!
Namo Bharath
Anand T
|

Updated on: Jun 17, 2025 | 10:53 PM

Share

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో కొత్తగా 200 రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే మంత్రిత్వశాఖ రంగం సిద్ధం చేస్తోంది. రైల్వే ప్రయాణాలపై ప్రయాణికులు చూపిస్తున్న ఆసక్తి నేపథ్యంలో వారికి సౌకర్య వంతమైన ప్రయాణాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్‌ రైళ్లు, 100 మెమూ రైళ్లు, 50 అమృత్‌ భారత్‌ రైళ్లు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్టు ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్‌ చేశారు. అయితే, ఈ రైళ్లును ఎప్పుడు అందుబాటులోకి తీసుకురాబోతున్నారనే వివరాలను మాత్రం ఆయన పేర్కొనలేదు.

మరోవైపు, హరియాణాలోని మనేసర్‌లో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ గతి శక్తి మల్టీ మోడల్‌ కార్గో టెర్మినల్‌ను మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిప ఆయన ప్రయాణికుల రైల్వే శాఖ అందిస్తున్న సేవలను మెరుగు పరచడం కోసం ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెమూ రైళ్ల కోచ్‌ల సంఖ్యను 8-12, నుంచి 16-20 పెంచుతున్నట్టు చెప్పారు. దీంతో తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులకు లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ మెమూ రైళ్ల తయారీ కోసం కాజీపేటలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు కొత్తగా 50 నమో భారత్‌ రైళ్లను తయారు చేసేందుకు కూడా రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా