Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు.. కేంద్రం తీరుపై మండిపడ్డ సీఏం కేజ్రీవాల్..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అక్టోబర్7 (శుక్రవారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశ రాజధాని, హైదరాబాద్, పంజాబ్ సహా 35 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని..

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు.. కేంద్రం తీరుపై మండిపడ్డ సీఏం కేజ్రీవాల్..
Enforcement Directorate
Follow us

|

Updated on: Oct 07, 2022 | 11:16 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అక్టోబర్7 (శుక్రవారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశ రాజధాని, హైదరాబాద్, పంజాబ్ సహా 35 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు, డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంలో అతకతవకలు జరిగాయన్న ఆరోపణలతో అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన నేపథ్యంలో 2021 నవంబర్ 17 నుంచి అమలులోకి తెచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఈ ఏడాది జూలైలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, కూకట్ పల్లితో పాటు మరో రెండు చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఢిల్లీ మద్యం కుభకోణంలో అక్రమాలపై ఈడీ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈడీ దాడుల నేపథ్యంలో మరోసారి ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డర్టీ పాలిటిక్స్ అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 3 నెలల నుండి 500 కంటే ఎక్కువ దాడులు చేశారని, 300 కంటే ఎక్కువ మందిని విచారించారని, ఇందుకోసం సిబిఐ, ఈడి అధికారులు 24 గంటలు పనిచేస్తున్నారని విమర్శించారు. మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నా ఎటువంటి ఆధారాలు కనుగొనలేదని, ఎందుకంటే మద్యం పాలసీలో ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని కేజ్రీవాల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇంత మంది అధికారుల సమయాన్ని నీచ రాజకీయాల కోసం వృధా చేస్తున్నారంటూ కేంద్రప్రభుత్వ వైఖరిపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇలాంటి దేశం ఎలా పురోగమిస్తుందంటూ ప్రశ్నించారు.

ఇలా ఉండగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ఈ విషయం ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే ఎంతో మందిని విచారించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు కొంతమంది ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న బ్యూరోక్రాట్‌లను నిందితులుగా పేర్కొన్న సీబీఐ, ఈ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. మరోవైపు మద్యం కొనుగోలుదారులను ఆకర్షించడానికి రిటైలర్లు పెద్ద డిస్కౌంట్లను అందించే విధానంలో భారీ అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపించగా.. అవినీతిని అరికట్టడమే తమ విధానామని, అందుకే కొత్త పాలసీ తీసుకొచ్చామని, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే అనేక సార్లు దాడులు నిర్వహించిన దర్యాప్తు సంస్థలు మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుని గత వారం అరెస్టు చేసింది. ఆప్ కమ్యూనికేషన్స్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత సమీర్ మహేంద్రుని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ