Rahul Gandhi: రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్.. ట్విట్ చేసిన కాంగ్రెస్ నేత.. ఏమన్నారంటే..?

Rahul Gandhi: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటిలు, రాజకీయ నాయకులు

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్.. ట్విట్ చేసిన కాంగ్రెస్ నేత.. ఏమన్నారంటే..?
Rahul Gandhi
Follow us

|

Updated on: Apr 20, 2021 | 3:47 PM

Rahul Gandhi – Covid-19: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం ట్విట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. తేలికపాటి లక్షణలు కనిపించిన అనంతరం కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. రిపోర్ట్ పాజిటివ్‌‌గా వచ్చినట్లు వెల్లడించారు. ఇటీవల తనతో సంప్రదించిన వారందరూ కరోనా నిబంధనలను పాటించాలని కోరారు. జాగ్రత్తగా సురక్షితంగా ఉండండంటూ ఆయన ట్విట్ చేశారు.

రాహుల్ గాంధీ చేసిన ట్విట్..

ఇదిలాఉంటే.. గత కొంతకాలంగా రాహుల్ గాంధీ తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రం అసమర్థత వల్లనే కోవిడ్ దేశమంతటా తీవ్రంగా వ్యాపించిందంటూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అవసరం లేని సమయంలో చర్యలు తీసుకుందని.. కానీ అవసరమున్న సమయంలో చేతులు దులుపుకుందంటూ ట్విట్ల మీద ట్విట్లు చేస్తున్నారు. 18-45 సంవత్సరాల వయస్సు వారికి ఉచిత టీకాలు లేవని.. ధర నియంత్రణ లేకుండా మధ్యవర్తులను తీసుకువచ్చారంటూ ఉదయం కూడా మండిపడ్డారు. బలహీనమైన విభాగాలకు వ్యాక్సిన్ హామీ లేదని.. వ్యాక్సిన్ పంపిణీలో వివక్ష తగదంటూ ట్విట్ చేశారు.

ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనావైరస్ సవిలయతాండవం చేస్తోంది. గత ఐదు రోజుల నుంచి నిత్యం రెండు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో (సోమవారం).. 2,59,170 కరోనా కేసులు నమోదు కాగా.. 1,761 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 20 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read:

SBI Zero Balance: ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేట్లు.. ఉచిత లావాదేవీలు, ఇతర పూర్తి వివరాలు

Lockdown: ఐదు న‌గ‌రాల్లో లాక్‌డౌన్‌ విధించిన హైకోర్టు.. ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఇంతకూ ఏమందంటే?