Rahul Gandhi: నాకొక ఐడియాలజీ ఉంది.. వరుణ్‌ గాంధీ కలిస్తే కౌగిలించుకుంటా.. కానీ..

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. సోదరుడు, బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్‌గాంధీతో తనకు సైద్దాంతిక విభేదాలు ఉన్నాయంటూ

Rahul Gandhi: నాకొక ఐడియాలజీ ఉంది.. వరుణ్‌ గాంధీ కలిస్తే కౌగిలించుకుంటా.. కానీ..
Rahul Gandhi Varun Gandhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 17, 2023 | 4:34 PM

Rahul Gandhi on cousin Varun Gandhi: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. సోదరుడు, బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్‌గాంధీతో తనకు సైద్దాంతిక విభేదాలు ఉన్నాయంటూ రాహుల్ పేర్కొన్నారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ నుంచి మంగళవారం ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన రాహుల్ గాంధీ మీడియాతో ముచ్చటించారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం, భారత్‌ జోడో యాత్రలో చేరడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై రాహుల్ స్పందించారు. వరుణ్‌గాంధీని కలిస్తే కౌగిలించుకుంటా కానీ.. ఇద్దరి రాజకీయాలు వేరంటూ పేర్కొన్నారు. వరుణ్‌గాంధీతో తనకు సైద్దాంతిక విభేదాలు ఉన్నాయంటూ రాహుల్‌గాంధీ వివరించారు. వరుణ్‌గాంధీ లాగా తాను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి వెళ్లడం అసాధ్యమన్నారు రాహుల్‌గాంధీ. ఆర్‌ఎస్‌ఎస్‌ను వరుణ్‌గాంధీ ప్రశంసించారని , అప్పుడు తాను ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర తెలుసుకోవాలని వరుణ్‌ను కోరినట్టు చెప్పారు. తమ కుటుంబం ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించినట్టు రాహుల్‌ వెల్లడించారు. ‘‘ఆయన బీజేపీలో ఉన్నారు, ఆయన సిద్ధాంతాలకు నా సిద్ధాంతాలకు పొంతన లేదు. నా కుటుంబానికి ఒక ఐడియాలజీ ఉంది.. వరుణ్ ఆ భావజాలాన్ని తన సొంతం చేసుకున్నాడు. నేను వరుణ్‌ని కౌగిలించుకోగలను కానీ ఆ భావజాలాన్ని అంగీకరించలేను.” అంటూ పేర్కొన్నారు.

కాగా, మంగళవారం యాత్ర ప్రారంభమైన వెంటనే ఒక వ్యక్తి అకస్మాత్తుగా పరుగెత్తుకుంటూ వచ్చి రాహుల్ గాంధీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నాయకులు, సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకుని అక్కడి నుంచి బయటకు పంపారు. ఈ తరుణంలో రాహుల్ గాంధీని మీడియా ప్రతినిధులు భద్రతా లోపంపై ప్రశ్నించారు. తన యాత్రలో ఎలాంటి భద్రతా లోపం లేదంటూ రాహుల్ జవాబిచ్చారు. వ్యక్తి తనను కౌగిలించుకోవడానికి వచ్చి ఆనందించాడని.. దీన్ని భద్రతలో లోపంగా చెప్పలేమన్నారు. ప్రయాణంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని వివరించారు.

ఇవి కూడా చదవండి

దేశంలోని అన్ని సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నియంత్రించాయని రాహుల్‌ గాంధీ విమర్శించారు.అధికార యంత్రాంగం, మీడియా, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. దేశంలో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారని.. బీజేపీ విద్వేష భావజాలాన్ని దేశం ముందు ఉంచిందన్నారు. బీజేపీ విద్వేష భావజాలాన్ని ప్రజలు అంగీకరించడం లేదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

అదే సమయంలో, రాహుల్ గాంధీ పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై కూడా ఫైర్ అయ్యారు. పాలనను పంజాబ్ నుంచి మాత్రమే చేయాలని.. ఢిల్లీ నుంచి కాదంటూ ఆప్ సీఎం భగవంత్ మాన్‌కు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..