Defamation Case: పరువునష్టం కేసుకు సంబంధించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు సూరత్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ గుజరాత్ అధ్యక్షుడు అమిత్ చావ్డా వివరాలు వెల్లడించారు. కేవలం కోర్టుకు మాత్రమే హాజరయ్యేందుకే రాహుల్ గాంధీ సూరత్ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ రాహుల్ పాల్గొనబోరని ఆయన స్పష్టచేశారు. ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ సూరత్ చేరుకొని.. మళ్లీ 12-12:20 గంటల సమయంలో తిరుగు ప్రయాణం అవుతారన్నారు. ఆయన పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు.
2019, ఏప్రిల్ 13న కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ సమయంలో ‘మోదీ’ ఇంటి పేరును ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. దొంగలందరీకి మోదీ ఇంటి పేరే ఎందుకు ఉంటుందంటూ ఆయన విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత, సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ తన మాటలతో మోదీ ఇంటి పేరున్న వారందరి ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ కోర్టులో పరువునష్టం దావా వేశారు.
ఈ కేసు విచారణ నిమిత్తం రాహుల్ గాంధీ 2019, అక్టోబరులోనూ కోర్టు ఎదుట హాజరయ్యారు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆ సమయంలో ఆయన కోర్టుకు వెల్లడించారు.
Also Read: