మన సాయుధ దళాలపై నమ్మకం లేని ప్రధాని, రాహుల్ గాంధీ మండిపాటు

భారత సాయుధ దళాల శక్తి సామర్థ్యాలపై ప్రధాని మోదీకి నమ్మకం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధానికి తప్ప ఇండియాలో ప్రతి వ్యక్తికీ ఇండియన్ ఆర్మీ  సత్తాపై  విశ్వాసం..

  • Umakanth Rao
  • Publish Date - 12:00 pm, Sun, 16 August 20
మన సాయుధ దళాలపై నమ్మకం లేని ప్రధాని, రాహుల్ గాంధీ మండిపాటు

భారత సాయుధ దళాల శక్తి సామర్థ్యాలపై ప్రధాని మోదీకి నమ్మకం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధానికి తప్ప ఇండియాలో ప్రతి వ్యక్తికీ ఇండియన్ ఆర్మీ  సత్తాపై  విశ్వాసం  ఉందని ఆయన ట్వీట్ చేశారు.  మోదీ పిరికితనం వల్లే చైనా మన భూభాగాలను ఆక్రమించుకుంటోందని ఆయన విమర్శించారు. ఆయన చెబుతున్న అబద్దాలు చైనా ఈ ఆక్రమిత భూభాగాలను నిలుపుకునేలా చేస్తున్నాయన్నారు. చైనా..సరిహద్దు సమస్యపై అసలు నిజాలను మోదీ బయటపెట్టడంలేదని, ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వడంలేదని రాహుల్ అన్నారు.

చైనా వివాదంపై రాహుల్ వరుసగా మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటాన పెడుతూ వస్తున్నారు. ప్రధాని వైఫల్యంపై ఇటీవల వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు.