AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honeymoon Murder Case: క్రైమ్‌ కహానీలో సోనమ్‌ కొత్త రికార్డ్‌ – మరో మహిళను చంపి అదృశ్యం కావాలని ప్లాన్‌

మేఘాలయ హనీమూన్‌ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘువంశీని చంపాక.. ఎవరైనా మహిళను హత్య చేసి.. మృతదేహాన్ని కాల్చి.. అది సోనమ్‌ది అని నమ్మించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు సమాచారం. లేదా సోనమ్ డెడ్‌బాడీ నదిలో కొట్టుకుపోయినట్లు నమ్మిద్దామనుకున్నారు. కానీ టూరిస్టులు ఎక్కువగా ఉండటంతో ఈ ప్లాన్స్ వర్కువుట్ అవ్వలేదు.

Honeymoon Murder Case: క్రైమ్‌ కహానీలో సోనమ్‌ కొత్త రికార్డ్‌ - మరో మహిళను చంపి అదృశ్యం కావాలని ప్లాన్‌
Honeymoon Murder Case
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2025 | 9:15 AM

Share

పోలీసుల ఎంట్రీతో ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదుగానీ .. లేకపోతే సోనమ్‌ కుట్రకు మరో ప్రాణం బలైఉండేది. కస్టడీలో ఉన్న హానీమూన్‌ మర్డర్‌ మాస్టర్‌మైండ్‌ సోనమ్‌ ఎంక్వయిరీలో షాకింగ్‌ నిజాలు బయటికొస్తున్నాయి. షిల్లాంగ్‌లో రాజా రఘువంశీని మర్డర్‌ చేశాక ఎలా పారిపోవాలో ముందే ప్లాన్‌ చేసుకుంది సోనమ్‌. ప్రియుడు రాజ్‌ కుష్వాహా ఇచ్చిన బుర్ఖా వేసుకుని పోలీసుల కంటపడకుండా తప్పించుకుంది. షిల్లాంగ్‌ నుంచి గౌహతికి టాక్సీలో చేరుకుంది సోనమ్‌. తర్వాత బస్సులో పశ్చిమబెంగాల్‌లోని సిలిగురికి చేరింది. అక్కడినుంచి పాట్నాకు ఆ తర్వాత రైల్లో లక్నోకి వచ్చింది. చివరికి బస్సులో ఇండోర్‌కి వెళ్లి అక్కడ ప్రియుడిని కలుసుకుంది.

హనీమూన్‌ వంకతో ఇండోర్‌ నుంచి గౌహతికి చేరుకోగానే అక్కడే రఘువంశీ అడ్డుతొలగించుకోవాలనుకుంది సోనమ్‌. కానీ గౌహతిలో ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదు. దీంతో సోనమ్‌ సూచనతో రాజ్‌ స్నేహితులు ముగ్గురూ మేఘాలయకు వెళ్లారు. వెసాడాంగ్ వాటర్‌ఫాల్స్‌ వద్ద అదనుచూసుకుని సోనమ్‌ డైరెక్షన్‌లో రాజా రఘువంశీని చంపేశారు. రాజ్‌తో పాటు సోనమ్ కూడా చనిపోయినట్టు నమ్మించాలనుకున్నారు. వేరే ఒక మహిళను చంపి, ఆమె శవాన్ని సోనమ్‌దిగా చూపించాలని నిందితులు స్కెచ్‌ వేశారు. కానీ ఆలోపే వారి పాపం పండింది. నిందితులంతా పోలీసులకు దొరికిపోయారు.

రాజా రఘువంశీని దారుణంగా చంపిన ముగ్గురూ డబ్బుకోసమే ఆ పనిచేశారని అంతా అనుకున్నారు. కానీ వారు కిరాయి హంతకులు కాదు. ఎలాంటి నేరచరిత్రా లేదు. రాజ్‌ కుష్వాహాకి స్నేహితులు. ఫ్రెండ్‌ అడిగాడని ప్రియురాలి భర్తను చంపేందుకు సిద్ధమయ్యారు. రాజ్‌ తన స్నేహితులకు 50వేల రూపాయలు ఇచ్చాడు. భర్తను చంపేశాక సోనమ్‌ వారికి కొంత డబ్బిచ్చింది. ఆకాష్‌ అరెస్ట్‌ కాగానే ప్రియుడు రాజ్‌ సూచనతో గాజీపూర్‌లో సోనమ్‌ పోలీసులకు లొంగిపోయింది. కిడ్నాప్‌ కథ అల్లినా అప్పటికే పోలీసులకు కీలక ఆధారాలు దొరకటంతో ఎంక్వైరీలో మర్డర్‌ కహానీ అంతా పూసగుచ్చినట్లు చెప్పేసింది.

రఘువంశీ మర్డర్‌కేసులో సోనమ్‌తో పాటు ఐదుగురు నిందితులను 8 రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా త్వరలో చార్జిషీట్ దాఖలు చేయబోతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..