Black Box: ఢిల్లీకి ఎయిర్ ఇండియా AI 171 విమాన బ్లాక్ బాక్స్ .. 24 నుంచి 48 గంటల్లో డేటా రికవరీ!
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది. ప్రమాదం జరిగిన 27 గంటల తర్వాత విమానంలోని బ్లాక్ బాక్స్‌ను అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్ బ్లాక్స్‌ను విశ్లేషిస్తే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ బ్లాక్ బ్లాక్స్ డేటాను విశ్లేషించడానికి సుమారు 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా AI 171 విమాన ప్రమాద దర్యాప్తు మొదలైంది. విమాన ప్రమాదం ఏ విధంగా జరిగిందని దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. విమాన ప్రమాదంపై NIA ,అహ్మదాబాద్ పోలీసులు ,DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఎయిర్ క్రాఫ్ట్ ఆక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో,గుజరాత్ ఫోరెన్సీక్ టీమ్ ,బోయింగ్ సంస్థ ప్రతినిధులు,బోయింగ్ విమానాల ఇంజన్లు తయారు చేసే GE సంస్థ ప్రతినిధులు దర్యాప్తు జరుపుతున్నారు. అవసరమైతే దర్యాప్తు లో భాగస్వామ్యం అయ్యేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ , నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు (అమెరికా) కూడా సిద్ధంగా ఉన్నాయి
విమాన ప్రమాద దర్యాప్తులో కీలకం కానున్న బ్లాక్ బాక్స్..
అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమాన బ్లాక్ బాక్స్ ను ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత గుర్తించారు. దీనిని త్వరలో ఢిల్లీకి తరలించనున్నారు DGCA అధికారులు. విమాన ప్రమాద దర్యాప్తుల కోసం ఢిల్లీలో ఉన్న బ్లాక్ బాక్స్ ల్యాబ్‌లో బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించనున్నారు DGCA,AAIB అధికారులు. ప్రమాద సమయంలో ఏటీసీతో పైలెట్లు ఏం మాట్లాడారు.. ఇటువంటి పరిస్థితుల్లో విమాన ప్రమాదం జరిగింది అన్న అంశాలు వెలుగులోకి రానున్నాయి.
ఢిల్లీలో తొలి బ్లాక్ బాక్స్ ల్యాబ్…
దేశంలో ఒకే ఒక బ్లాక్ బాక్సు ల్యాబ్ ఢిల్లీ ఉడాన్ భవన్‌లో ఉంది. దీనిని గత ఏప్రిల్ 9వ తేదీన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మద్దతుతో రూ. 9 కోట్ల ఖర్చుతో దేశంలో మొదటి బ్లాక్ బాక్స్ ల్యాబ్ నిర్మాణం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఏర్పాటైంది. భారతదేశంలో జరిగే విమాన ప్రమాద దర్యాప్తు సామర్థ్యాలను అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉండేలా ఈ ల్యాబ్‌ను రూపొందించారు. నూతన ల్యాబ్లో జరిగే తొలి బ్లాక్ బాక్స్ విశ్లేషణ ఎయిర్ ఇండియా AI 171 దే కానుంది. ప్రమాదానికి గురైన విమాన డేటాను తిరిగి పొందడానికి, డీకోడ్ చేయడానికి, కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లు, రాడార్ ఫ్లైట్ డేటా సిస్టమ్‌ల నుండి సమాచారాన్ని తెలుసుకోవడానికి, బ్లాక్ బాక్స్‌లను రిపేర్ చేయడానికి బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. ఒక బ్లాక్ బాక్స్ డేటా 24 గంటల నుంచి 48 గంటల్లో విశ్లేషించబడుతుంది.

బ్లాక్ బాక్స్..
విమాన డేటా, కాక్‌పిట్ ఆడియోను రికార్డ్ చేసే విమాన పరికరమే బ్లాక్ బాక్స్. విమన ప్రమాద దర్యాప్తుకులో ఈ బ్లాక్ బాక్స్ డేటా కీలకం కానుంది. ఈ బ్లాక్ బాక్స్ లో FDR (ఫ్లైట్ డేటా రికార్డర్), CVD (కాక్‌పిట్ వాయిస్ రికార్డర్). నిక్షిప్తమై ఉంటుంది. వివిధ రకాల విమాన సెన్సార్ల ద్వారా డేటా FDR లో స్టోర్ అవుతుంది. రేడియో ట్రాన్స్‌మిషన్,పైలట్ ఆడియోను రికార్డ్ CVR లో స్టోర్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ నారింజ రంగులో ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




